మంగళవారం 26 మే 2020
Science-technology - May 22, 2020 , 16:00:08

రియల్‌మీ నార్జో 10A స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు షురూ..

రియల్‌మీ నార్జో 10A స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు షురూ..

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ రియల్‌మీ ఇటీవల  నార్జో సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు భారత్‌లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే.  రియల్‌మీ నార్జో 10 ఫోన్‌ విక్రయాలు మే 18న ప్రారంభంకాగా వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రియల్‌మీ నార్జో10(ధర రూ.11,999 )  అమ్మకాల్లో దుమ్మురేపింది. 128 సెకన్లలోనే  రికార్డు స్థాయిలో 70వేలకు పైగా ఫోన్లు అమ్మేసింది.   

శుక్రవారం మధ్యాహ్నం నుంచి   రియల్‌మీ నార్జో 10A  స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు మొదలయ్యాయి. ప్రముఖ ఇ-కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ.డాట్‌కామ్‌లలో నూతన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంటాయి. నార్జో 10A (ధర రూ.8,499) బ్లూ, వైట్‌ కలర్లలో అందుబాటులో ఉంది. 

రియల్‌మీ నార్జో  10A స్పెసిఫికేషన్లు...

డిస్‌ప్లే:6.52 అంగుళాల డిస్‌ప్లే

ప్రాసెసర్‌: మీడియాటెక్‌ హీలియో జీ70 

ఫ్రంట్‌ కెమెరా: 5 మెగా పిక్సల్‌(mp)

రీయర్ కెమెరా: 12 mp + 2 mp+ 2 mp 

ర్యామ్‌:3జీబీ

స్లోరేజ్‌:32జీబీ

బ్యాటరీ:5000mAh

ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10


logo