ఆదివారం 05 జూలై 2020
Science-technology - Jun 30, 2020 , 12:47:04

రియల్‌మీ నార్జో 10 ఫ్లాష్‌సేల్‌ ప్రారంభం

రియల్‌మీ నార్జో 10 ఫ్లాష్‌సేల్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ రియల్‌మీ  నార్జో సిరీస్‌లో నార్జో 10ఏ, నార్జో 10  మోడళ్లను భారత్‌లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు రెండు ఫోన్లను ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచగా కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.  మంగళవారం మధ్యాహ్నం  12 గంటల నుంచి రియల్‌మీ నార్జో 10 ఫోన్ల కోసం మరోసారి ఫ్లాష్‌సేల్‌  ప్రారంభించింది. 4జీబీ + 128జీబీ  స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.11,999 గా నిర్ణయించింది. 

ప్రముఖ ఇ-కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌సైట్ల ద్వారా  స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయొచ్చు.  ప్రస్తుతం నార్జో 10 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.  గ్రీన్‌, వైట్‌, బ్లూ కలర్ల ఫోన్లను ఫ్లాష్‌సేల్‌కు ఉంచారు.   ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే వినియోగదారులు 5శాతం క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. 


logo