బుధవారం 03 జూన్ 2020
Science-technology - Feb 10, 2020 , 11:13:09

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి డేస్‌ సేల్‌.. తగ్గింపు ధరలకు రియల్‌మి ఫోన్లు..

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి డేస్‌ సేల్‌.. తగ్గింపు ధరలకు రియల్‌మి ఫోన్లు..

ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ తన సైట్‌లో రియల్‌మి డేస్‌ సేల్‌ను నిర్వహిస్తున్నది. ఇవాళ ప్రారంభమైన ఈ సేల్‌ ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ఐసీఐసీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులతో ఫోన్లను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు. అలాగే రియల్‌మి 5 ప్రొ రూ.3వేల తగ్గింపు ధరకు ఈ సేల్‌లో లభిస్తున్నది. రియల్‌మి సి2 రూ.2వేల తగ్గింపు ధరకు, రియల్‌మి 3 ప్రొ రూ.6వేల తగ్గింపు ధరకు, రియల్‌మి ఎక్స్‌, ఎక్స్‌టీలు రూ.3వేలు, రూ.1వేయి తగ్గింపు ధరలకు ఈ సేల్‌లో వినియోగదారులకు లభిస్తున్నాయి. ఇక రియల్‌మి ఎక్స్‌2 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ రూపంలో కొనుగోలు చేస్తే రూ.2వేల వరకు అదనపు డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు. 


logo