ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ తాజాగా సీ25వై మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. సీ సిరీస్‌లో 50 ఎంపీ కెమెరాతో ఫోన్ విడుదల కావడం ఇదే తొలిసారి. ఇప్పటికే రిలీజ్ అయిన రియల్మీ సీ25 ఫోన్‌కు ఇది అప్‌గ్రేడ్ వర్షన్. ఇందులో కూడా వాటర్‌డ్రాప్ స్టైల్ నాట్చ్ ఉంటుంది.
ఇటీవల రిలీజ్ అయిన రెడ్మీ 10 ప్రైమ్ ఫోన్‌కు పోటీగా రియల్మీ సీ25వై స్మార్ట్‌ఫోన్‌ను అత్యాధునికమైన ఫీచర్లతో బడ్జెట్ ధరలో మార్కెట్లోకి తీసుకొచ్చింది.
సీ25వై సిరీస్‌లో రెండు వేరియంట్ల ఫోన్లను రియల్మీ విడుదల చేసింది. 4 జీబీ ప్లస్ 64 జీబీ వేరియంట్ ఫోన్ ధరను రూ.10,999గా నిర్ణయించగా.. 4 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధరను రూ.11,999గా నిర్ణయించింది. రెండు మోడల్స్ బ్లూ, గ్రే కలర్లలో లభించనున్నాయి. సెప్టెంబర్ 20 నుంచి ఈ ఫోన్ల ప్రీఆర్డర్స్ ప్రారంభం అవుతాయి. సెప్టెంబర్ 27 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్సైట్, రిటెయిల్ ఔట్లెట్స్ ద్వారా సేల్స్ ప్రారంభం కానున్నాయి.
ఆండ్రాయిడ్ 11, 6.5 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఆక్టాకోర్ యూనిసక్ టీ610 ఎస్వోసీ ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా సెటప్, 50 ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వైఫై 802, బ్లూటూత్ వీ5, మైక్రో యూఎస్బీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదలైంది.
iPhone 13 : ఐఫోన్ 13లో అత్యంత ఖరీదైన మోడల్ ధర ఎంతో తెలుసా?
Redmi Smart TV: అద్భుతమైన ఫీచర్లతో రెడ్మీ స్మార్ట్ టీవీ సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఐఫోన్ 13 వచ్చేసింది.. మరి iOS 15 వచ్చేది ఎప్పుడో తెలుసా !!
iOS 15 Release Date | ఐఫోన్ 13 వచ్చేసింది.. భారత్‌లో ధరలు ఇలా..