ఆదివారం 05 జూలై 2020
Science-technology - Jun 30, 2020 , 15:06:59

అద్భుత ఫీచర్లతో రియల్‌మి C11 లాంచ్‌

అద్భుత ఫీచర్లతో రియల్‌మి  C11 లాంచ్‌

న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ తయారీదారు రియల్‌మి  బడ్జెట్‌ ధరలో   కొత్త  స్మార్ట్‌ఫోన్‌ను  ఆన్‌లైన్  ద్వారా లాంచ్ చేసింది.  రియల్‌మి C11  పేరుతో నూతన మోడల్‌ను  ఆవిష్కరించింది.వాటర్‌ డ్రాప్‌ స్టైల్‌తో డిస్‌ప్లేను అద్భుతంగా డిజైన్‌ చేశారు.   ఇటీవల రియల్‌మి ఎక్స్‌ 3, రియల్‌మి ఎక్స్‌ 3 సూపర్‌జూమ్‌ పేరుతో  రెండు ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. 

సీ11 ఫోన్‌లో రివర్స్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ కూడా ఉంది.  పవర్‌ బ్యాంక్‌ తరహాలోనే ఇతర డివైజ్‌లను ఛార్జింగ్‌ చేసుకోవచ్చు.  ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) డ్యూయల్‌ కెమెరాలు ఫోన్‌లోని ప్రత్యేకత. రియల్‌మి సీ11ను  భారత్‌లో ఎప్పుడు లాంచ్‌ చేస్తారనే విషయం స్పష్టత రావాల్సి ఉంది. జులై 7 నుంచి మలేషియాలో ఫోన్లను విక్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది.   భారత్‌లో  2జీబీ ర్యామ్‌ + 32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర సుమారు  8వేలకు పైనే ఉండనున్నట్లు తెలుస్తున్నది. 

రియల్‌మి సీ11 స్పెసిఫికేషన్లు.:

డిస్‌ప్లే: 6.50 అంగుళాలు

ప్రాసెసర్‌: మీడియా టెక్‌ హీలియో జీ35

ఫ్రంట్‌ కెమెరా: 5 మెగా పిక్సల్‌

రియర్‌ కెమెరా: 13+2 మెగా పిక్సల్‌

ర్యామ్‌: 2జీబీ

స్టోరేజ్‌:32జీబీ

బ్యాటరీ:5000mAh

ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10


logo