ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు రియల్మీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శుభవార్త చెప్పింది. త్వరలోనే రియల్మీ నుంచి 9 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. రియల్మీ ఇప్పటికే 8 సిరీస్‌ను విడుదల చేసింది. అయితే.. దానికి కొనసాగింపుగా రియల్మీ 9 సిరీస్‌ను కూడా విడుదల చేయాలంటూ రియల్మీ ఫోన్ లవర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.
దీంతో.. రియల్మీ 9 సిరీస్ విడుదల గురించి కంపెనీ సీఎంవో ఫ్రాన్సిస్ వాంగ్.. ట్వీట్ చేశారు.
ప్రతి సంవత్సరం రియల్మీ సరికొత్త మోడల్స్‌ను విడుదల చేస్తుంది. చాలామంది రియల్మీ 9 సిరీస్ గురించి అడుగుతున్నారు. ఎలాగూ సెప్టెంబర్ 9న రియల్మీ 8ఎస్, 8ఐ రెండు మోడల్స్‌ను విడుదల చేస్తున్నాం. ఆరోజే.. రియల్మీ 9కు సంబంధించి బిగ్ అనౌన్స్మెంట్ ఉంటుంది.. అని ఆయన ట్వీట్ చేశారు.
అంటే.. రియల్మీ 9 సిరీస్ కూడా త్వరలోనే విడుదల కాబోతోందని అర్థం అయింది. అయితే.. ఈ సిరీస్‌కు సంబంధించిన ఎటువంటి సమాచారం మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేదు. 9 సిరీస్‌లో కూడా రెడ్మీ 9, 9 ప్రో మోడల్స్ ఫోన్లు విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Realme Pad : రియల్మీ నుంచి తొలి ట్యాబ్.. రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే
Redmi Earbuds 3 Pro : 30 గంటల బ్యాటరీ లైఫ్‌తో రెడ్మీ ఇయర్‌బడ్స్ 3 ప్రో విడుదల