మంగళవారం 02 జూన్ 2020
Science-technology - Feb 23, 2020 , 12:54:07

పబ్‌జి మొబైల్‌ ఆడండి... ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులకు సహాయం చేయండి..!

పబ్‌జి మొబైల్‌ ఆడండి... ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులకు సహాయం చేయండి..!

ఆస్ట్రేలియాలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న కార్చిర్చు సంఘటనతో ఎన్నో మూగజీవాలు బలైన సంగతి తెలిసిందే. అలాగే ఎంతో విలువైన అటవీ ప్రాంతం దగ్ధమైంది. ఎంతో ఆస్తి నష్టం సంభవించింది. అయితే ఆ నష్టాన్ని కొంత వరకు పూడ్చేందుకు, బాధితులకు సహాయం చేసేందుకు ప్రముఖ గేమింగ్‌ సంస్థ పబ్‌జి కార్ప్‌ ముందుకు వచ్చింది. 

పబ్‌జి మొబైల్‌ గేమ్‌లో అందుబాటులో ఉన్న ఆస్ట్రేలియా ఫైర్‌ రిలీఫ్‌ పాన్‌ స్కిన్‌ను యూజర్లు కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలో ఆ కొనుగోళ్లు ద్వారా వచ్చిన మొత్తాన్ని పబ్‌జి కార్ప్‌ ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులకు అందజేయనుంది. అలాగే కాల్‌ ఆఫ్‌ డ్యూటీ మొబైల్‌ కూడా ఇందులో భాగస్వామ్యం అయింది. ఆ గేమ్‌ను ఆడడం వల్ల కూడా యూజర్లు సదరు బాధితులకు సహాయం చేయవచ్చు. ఇక బెతెస్ధ, యుబిసాఫ్ట్‌ వంటి పలు గేమింగ్‌ కంపెనీలు కూడా ఆస్ట్రేలియా కార్చిచ్చు నష్టాన్ని పూడ్చేందుకు సహాయం చేయడానికి ముందుకు రానున్నాయి..! 


logo