సోమవారం 25 మే 2020
Science-technology - Apr 02, 2020 , 19:01:06

రెండు వ్యాక్సిన్ల‌పై ప్రీ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌..ఆస్ట్రేలియా శాస్త్ర‌వేత్త‌ల ముంద‌డుగు

రెండు వ్యాక్సిన్ల‌పై ప్రీ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌..ఆస్ట్రేలియా శాస్త్ర‌వేత్త‌ల ముంద‌డుగు

మెల్బోర్న్‌: క‌రోనా మ‌హ‌మ్మారిని అంత‌మొందించేందుకు అనేక ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇందుకు వ్యాక్సిన్‌ను రుపొందించే విషయంలో ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. వైరస్‌ను అడ్డుకోవచ్చని భావిస్తున్న రెండు టీకాలను ప్రస్తుతం ప్రయోగశాలల్లో పరీక్షిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రైమ‌రీ స్టేజ్‌లో ఉన్నామ‌ని ఇది పూర్తి కావ‌డానికి మ‌రో మూడు నెల‌ల స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చని పేర్కొన్నారు. అయితే ప్రాథ‌మిక ద‌శ త‌ర్వాత‌.. వ‌చ్చే ఏడాది చివ‌రినాటికి వ్యాక్సిన్ వ‌చ్చే అవ‌కాశ‌మున్న‌ద‌ని అంచ‌నా వేసింది.సాధారణంగా ప్రయోగాలు ఈ స్థాయికి చేరుకునేందుకు కనీసం ఒకటి నుంచి రెండేళ్లు పడుతుంద‌ని... కానీ కొద్ది నెలల్లోనే ఇప్పుడు ఇది సాధ్యమైంద‌ని సీఎస్ఐఆర్‌ఓకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రోబ్ గ్రీన్‌ఫెల్  అన్నారు.

అటు ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం, అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఇనోవియోతో కలిసి సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సీన్‌ను జంతువులపై పరీక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించింది. అయితే ప్రస్తుతం తమ దేశంలో తయారైన వ్యాక్సీన్ సత్ఫలితాన్నిస్తే మానవులకు వరంగా మారనుందని ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన్సీ భావిస్తోంది.


logo