గురువారం 04 జూన్ 2020
Science-technology - Feb 04, 2020 , 14:24:43

అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌

అదిరిపోయే ఫీచర్లతో విడుదలైన పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌

మొబైల్స్‌ తయారీదారు పోకో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ పోకో ఎక్స్‌2ను భారత్‌లో ఇవాళ విడుదల చేసింది. ఇందులో 6.67 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ 120 గిగాహెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్‌ 730జి పవర్‌ఫుల్‌ ప్రాసెసర్‌తోపాటు 8జీబీ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే లిక్విడ్‌ కూలింగ్‌ ఫీచర్‌ను కూడా ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఈ ఫోన్‌లో యూజర్లకు లభిస్తున్నది. 

ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 64 మెగాపిక్సల్‌ భారీ కెపాసిటీ కలిగిన కెమెరాతోపాటు 8, 2, 2 మెగాపిక్సల్‌ కెపాసిటీ కలిగిన మరో 3 కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 20, 2 మెగాపిక్సల్‌ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలతో అద్భుతమైన ఫొటోలు కాప్చర్‌ చేయవచ్చు. వీడియోలు తీసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌లో డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ ఫోన్‌కు పక్క భాగంలో ఉంటుంది. 4500 ఎంఏహెచ్‌ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. దీనికి 27 వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. 


పోకో ఎక్స్‌2 ఫీచర్లు... 

  •  6.67 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ 
  •  ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 730జి ప్రాసెసర్‌, 6/8 జీబీ ర్యామ్‌
  •  64/128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 10, హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌ 
  •  64, 8, 2, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, వీవోవైఫై, బ్లూటూత్‌ 5.0 
  •  20, 2 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరాలు, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ 
  •  సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఐఆర్‌ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్‌ సి  
  •  4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌

పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.15,999 ఉండగా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.16,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియెంట్‌ ధర రూ.19,999గా ఉంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్‌ స్టోర్‌లలో ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో ఈ ఫోన్‌పై రూ.1వేయి వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను అందివ్వనున్నారు. 


logo