గురువారం 25 ఫిబ్రవరి 2021
Science-technology - Jan 27, 2021 , 16:07:07

పోకో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్...!

పోకో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్...!

న్యూఢిల్లీ  షియోమీ సబ్‌బ్రాండ్ పోకో  త్వరలో  భారత మార్కెట్లోకి  సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయబోతున్నది. నూతన మోడల్‌ పోకో M3 స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 2న విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ ఫోన్‌ విడుదల కాగా భారత్‌లో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఫోన్లను విక్రయించనున్నారు. 

బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో  రియల్‌మీ 6, రియల్‌మీ నార్జో 20, మోటో జీ9 పవర్‌కు పోటీఇవ్వనుంది. ఈ ఫోన్‌ కూల్‌ బ్లూ, పోకో ఎల్లో, పవర్‌ బ్లాక్‌ కలర్లలో అందుబాటులో ఉండనున్నట్లు తెలిసింది.  4జీ ర్యామ్‌+64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.11వేలు, 4జీబీ ర్యామ్‌+128జీబీ స్టోరేజ్‌ ధర రూ.12,500 వరకు ఉండొచ్చు. 

పోకో ఎం3 స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే: 6.53 అంగుళాలు

ప్రాసెసర్‌:క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 662

ఫ్రంట్‌ కెమెరా:8 మెగా పిక్సల్‌

రియర్‌ కెమెరా: 48+2+2 మెగా పిక్సల్‌

ర్యామ్‌: 4జీబీ

స్టోరేజ్‌: 64జీబీ

బ్యాటరీ కెపాసిటీ: 6000mAh

ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10

 

VIDEOS

logo