శుక్రవారం 05 మార్చి 2021
Science-technology - Feb 09, 2021 , 17:33:17

పోకో M3 సేల్‌ ప్రారంభం..రూ.1,000 తగ్గింపు

పోకో M3 సేల్‌ ప్రారంభం..రూ.1,000 తగ్గింపు

న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమీ సబ్‌బ్రాండ్ పోకో ఇటీవల  పోకో  M3 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.  తాజాగా భారత్‌లో ఎం3 ఫోన్‌ విక్రయాలు ప్రారంభమయ్యాయి. పోకో ఎం2కు కొనసాగింపుగా గతవారం ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. పోకో ఎం3 ట్రిపుల్‌ రియర్‌ కెమెరాలు, వాటర్‌ డ్రాప్‌ స్టైల్‌ డిస్‌ప్లే నాచ్‌తో వస్తోంది.  రియల్‌మీ ఐ7, శాంసంగ్‌ గెలాక్సీ ఎం11 వంటి మోడళ్లకు ఎం3 గట్టిపోటీనివ్వనుంది. 

భారత్‌లో పోకో ఎం3 ధర రూ. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ.10,999గా నిర్ణయించారు.    6 జీబీ  ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్  మోడల్‌  ధర రూ. 11,999గా ఉంది.   రెండు మోడళ్లు కూడా కూల్‌ బ్లూ, పోకో ఎల్లో, పవర్‌ బ్లాక్‌ కలర్లలో వస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా పోకో ఎం3 ఫోన్లు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచారు.  సేల్‌ ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ లేదా ఈఎంఐ ద్వారా పోకో ఎం3ని కొనుగోలు చేస్తే  అదనంగా రూ.1,000 తగ్గింపు లభించనుంది. 

VIDEOS

logo