బుధవారం 12 ఆగస్టు 2020
Science-technology - Jul 14, 2020 , 10:20:00

Poco M2 Pro‌ స్మార్ట్‌ఫోన్‌ ఫస్ట్‌ సేల్‌ నేడే

Poco M2 Pro‌ స్మార్ట్‌ఫోన్‌  ఫస్ట్‌ సేల్‌ నేడే

ముంబై:  చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ  షియోమీ   అనుబంధ సంస్థ పోకో  ఇటీవల భారత్‌లో పోకో ఎం2 ప్రొ  స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే.   భారత్‌లో విడుదలైన మూడో పోకో ఫోన్‌ ఇది.  కొత్త ఫోన్లను ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌  ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు.  ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫస్ట్‌సేల్‌ ప్రారంభంకానుంది.  ఈ ఫోన్‌ గ్రీన్‌, బ్లూ, బ్లాక్‌ కలర్లలో అందుబాటులో ఉంది.  ఇప్పటి వరకు పోకో  F1, పోకో X2 ఫోన్లను  విడుదల చేసింది.  సరికొత్త మోడల్‌ ప్రారంభ ధర రూ. 13,999గా  నిర్ణయించారు. ఈ ఫోన్‌  4/64GB, 6/64GB and 6/128GB  మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.   

4GB ర్యామ్‌ + 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌  ధర రూ. 13,999

 6GB ర్యామ్‌ and 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌  ధర రూ.14,999

 6GB ర్యామ్‌ + 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌  ధర రూ.16,999 

తాజావార్తలు


logo