చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో.. తాజాగా సీ సిరీస్‌కు సంబంధించిన అప్డేట్ను అందించింది. సెప్టెంబర్ 30న సీ సిరీస్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోకో సీ3 ఫోన్‌కు కొనసాగింపుగా సీ4 ఫోన్‌ను తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 30న మధ్యాహ్నం 12 గంటలకు పోకో సీ సిరీస్ లాంచ్ ఉంటుందని.. సీయూ సూన్ అంటూ పోకో ట్వీట్ చేసింది.
గత సంవత్సరం రిలీజ్ అయిన సీ3 ఫోన్లు ఇండియాలో విపరీతంగా అమ్ముడుపోయాయి. దానికి కారణం.. పోకో ఫోన్లలో ఉండే బెస్ట్ హార్డ్‌వేర్, బడ్జెట్ ధర. అందుకే.. చాలామంది మధ్యతరగతి ప్రజలు.. ఈ ఫోన్‌ను కొనేందుకు ఆసక్తి చూపారు. పోకో సీ3 ఫోన్ ప్రస్తుతం రూ.7349 రూపాయలకే లభిస్తోంది. పోకో సీ4 ఫోన్ కూడా ఇంచుమించు ఇదే ధరలో లభిస్తుందని సమాచారం.
పోకో సీ4 స్పెసిఫికేషన్లను కంపెనీ అఫిషియల్‌గా ప్రకటించనప్పటికీ.. సీ3 ఫోన్లో ఉన్న ఫీచర్లతో పాటు.. ఏవైనా ఎక్స్ట్రా ఫీచర్లను యాడ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పోకో సీ3 లాగానే.. ఇందులోనూ 6.53 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ35 ఎస్వోసీ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 13 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్స్ చార్జింగ్, మైక్రో యూఎస్బీ పోర్ట్ లాంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Redmi 9 Activ : రెడ్మీ 9 యాక్టివ్, 9ఏ స్పోర్ట్ సేల్స్ ప్రారంభ తేదీ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఇవే
Samsung Galaxy M52 5G : సామ్సంగ్ గెలాక్సీ ఎం52 5జీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ధర, ఫీచర్ల వివరాలు
Vivo X70 : వివో ఎక్స్70 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే