మంగళవారం 26 మే 2020
Science-technology - Apr 05, 2020 , 09:24:37

లాక్‌డౌన్ విధుల్లో పోలీస్ రోబో

లాక్‌డౌన్ విధుల్లో పోలీస్ రోబో

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 ను అరిక‌ట్ట‌డం కోసం ప‌లు లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నాయి. ఈ లాక్‌డౌన్‌ను అమ‌లు చేయ‌డంలో పోలీసులు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అయితే, కొంత‌ మంది లాక్‌డౌన్‌ను లెక్క చేయ‌కుండా రోడ్ల మీద‌కు వ‌స్తుండ‌టంతో పోలీసుల‌కు ప‌నిభారం పెరిగిపోయింది. ఈ నేప‌థ్యంలో ఉత్తర ఆఫ్రికా దేశమైన ట్యునీషియా పోలీస్‌ రోబోలను రంగంలోకి దించింది. పీగార్డ్‌గా సుపరిచితమైన ఈ రోబోలు రిమోట్‌ సాయంతో పనిచేస్తాయి. ఈ రోబోల్లో ఇన్‌ఫ్రారెడ్‌, థర్మల్‌ ఇమేజ్‌ కెమెరాలతోపాటు సౌండ్‌ అండ్‌ లైట్‌ అలారాలను అమర్చారు. వాటి సాయంతో ఈ రోబోలు స‌మ‌ర్థంగా పోలీస్ విధులు నిర్వ‌హిస్తున్నాయి. లాక్‌డౌన్ నేప‌థ్యంలో వీధుల్లో తిరుగుతూ రోడ్ల‌పైకి వ‌చ్చిన వారిని..  రోడ్డు మీద‌కు ఎందుకొచ్చావ్‌? లాక్‌డౌన్‌ ఉందని తెలియదా? ఇక్క‌డ ఏం చేస్తున్నావ్‌? నీ ఐడీ కార్డు చూపించు! అంటూ ప్రశ్నిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను టునీషియా ఇంటీరియర్‌ మినిస్ట్రీ ఇటీవ‌ల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo