ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి చెక్ పెట్టేందుకు వివిధ దేశాల్లోని శాస్త్రవేత్తలు, పరిశోధకులు కృషిచేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, పెద్ద ఎత్తున మోతాదులను ఉత్పత్తి చేయలేకపోవడం కారణంగా అన్ని దేశాల ప్రజలకు వ్యాక్సిన్ లభించడం లేదు. ప్రజల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు మరో ప్రత్యేక పద్ధతిని అనుసరించి వ్యాక్సిన్ (New Carona Vaccine) సిద్ధం చేశారు. ‘మాలిక్యులర్ ఫార్మింగ్’ పద్ధతిన ఈ వ్యాక్సిన్ తయారు చేయనున్నారు. మొక్కల నుంచి తయారుచేసిన వ్యాక్సినే ‘కోవీఎల్పీ’ (వైరస్ లైక్ పర్టికల్స్). ఈ టెక్నాలజీతో తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్ తక్కువ ధరకే లభిస్తుందని పరిశోధకులు అభయమిస్తున్నారు. ఈ అధ్యయనం వ్యాక్సిన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ పరిశోధన ఇంగ్లండ్‌కు చెందిన జాన్ ఇన్నేస్ సెంటర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నది.
‘మాలిక్యులార్ ఫార్మింగ్’ పద్ధతి ద్వారా తయారు చేసిన వ్యాక్సిన్ మానవులకు వారి అవసరాలకు అనుగుణంగా ఇవ్వవచ్చునని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ టెక్నిక్‌తో వ్యాక్సిన్ తయారు చేయడానికి శాస్త్రవేత్తలు మొదట ల్యాబ్‌లో వైరస్ యొక్క జన్యు పదార్థాన్ని తయారు చేస్తారు. తర్వాత దానిని ఒక మొక్కలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ విధంగా వైరస్ యొక్క జన్యు పదార్ధం మొత్తం మొక్కకు చేరుతుంది. మొక్క పెరిగినప్పుడు దాని ఆకులను తెంపి వాటి నుంచి రసాన్ని తీస్తారు. ఫిల్టర్ చేసిన అనంతరం దీని నుంచి టీకా తయారు చేస్తారు.
ఇంకా, రెండు దశల్లో మూడు ట్రయల్స్ నిర్వహణలో మొక్కల ఆధారిత హెచ్ఏ వీఎల్పీ – శ్వాసకోశ అనారోగ్యం, పెద్ద వయసు వారిలో ఇన్‌ఫ్లూయెంజా వైరస్ల వల్ల కలిగే ఆరోగ్య సమస్యల నుంచి కాపాడతాయని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ టీకాను ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య నిపుణులు సమీక్షిస్తున్నారు. ఈ టెక్నిక్‌తో ప్రసిద్ధ బ్రిటిష్ ఫార్మా కంపెనీ గ్లాక్సో స్మిత్ క్లైన్, బయోటెక్ కంపెనీ మెడికాగో కలిసి సంయుక్తంగా ‘కోవిడ్ కోవీఎల్పీ’ వ్యాక్సిన్‌ను సిద్ధం చేశాయి. దీంతోపాటు ఫ్లూ వ్యాక్సిన్‌ను కూడా తయారు చేశారు.
బైడెన్‌పై పత్రికల ముప్పేట దాడి.. ఎందుకంటే..?
త్వరలో టాటా, ఐటీసీ సూపర్ యాప్స్..!
జిల్లా వచ్చె.. గడ్డం పాయె ఢాం ఢాం ఢాం..
మేఘాలయలో హింస : హోం మంత్రి రాజీనామా
దేశం విడిచి ఎందుకు వెళ్లిపోయానంటే..? : అష్రఫ్ ఘనీ
ఆ మెసేజ్ అందడానికి 18 గంటలు పట్టింది..!
ధోనీతోనే రిటైర్ ఎందుకు అయ్యానంటే..? : సురేశ్ రైనా
సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..