శుక్రవారం 27 నవంబర్ 2020
Science-technology - Oct 22, 2020 , 17:06:59

ఫిలిప్స్‌ నుంచి ఎయిర్‌ ప్యూరిఫయర్స్‌

ఫిలిప్స్‌ నుంచి ఎయిర్‌   ప్యూరిఫయర్స్‌

ముంబై: ప్రతీ ఏడాది శీతాకాలంలో   దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని పలు నగరాల్లో  కాలుష్యం జన జీవనాన్ని కకావికలం చేస్తున్న విషయం తెలిసిందే.     అక్కడి ప్రజలు వాయు కాలుష్యంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫిలిప్స్‌ గృహాల కోసం   ఎయిర్‌   ప్యూరిఫయర్స్‌ను మార్కెట్లోకి  విడుదల చేసింది. 

కొత్తి ఫిలిప్స్‌ అర్బన్‌ లివింగ్‌ సిరీస్‌ ఎయిర్‌ ప్యూరిఫైయర్లను భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. సిరీస్‌ 1000, సిరీస్‌ 2000i , సిరీస్‌ 3000i   అనే మూడు   సిరీస్‌లలో లభించనుంది.   ప్యూరిఫైయర్‌ ధర రూ.17,500 నుంచి ప్రారంభంకాగా మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.   అధునాతన టెక్నాలజీతో  డిజైన్‌ చేసిన ప్యూరిఫైయర్లు గదిలో అతి తక్కువ సమయంలోనే గాలి ప్రసరణకు సహాయపడతాయి. 

వాయు కాలుష్యం శ్వాసకోశ సమస్యలను కలిగించడంతో పాటు ఊపిరితిత్తులు, గుండె, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కంపెనీలు  ఎయిర్‌ పొల్యూషన్‌ ప్యూరిఫయర్స్‌ను తయారు చేస్తున్నాయి.