ఒప్పో రెనో 6 సిరీస్ లాంచ్ అయింది. చైనాలో జరిగిన ఓ ఈవెంట్లో ఊహించిన విధంగానే ఒప్పో మూడు స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో 6 ప్రొ+, ఒప్పో రెనో 6 ప్రొ, ఒప్పో రెనో 6 పేర్లతో మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ ఫోన్లు 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్నాయి. అన్ని మోడళ్లు కూడా హోల్ పంచ్ డిస్ప్లే, 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఒప్పో రెనో 6 ప్రొ+ చాలా ఖరీదైన ఫోన్. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో వస్తుంది. ఒప్పో రెనో 6 బేస్ మోడల్ ప్రారంభ ధర సుమారు రూ.31,800గా ఉంది. రెనో 6 ప్రొ ప్రారంభ ధర రూ.39,800 కాగా, ప్రీమియం మోడల్ రెనో 6 ప్రొ+ ధర సుమారు రూ.45,500గా నిర్ణయించారు. ప్రస్తుతం మూడు ఫోన్లు బుకింగ్ చైనాలో ప్రారంభమైంది. జూలైలో రెనో 6 సిరీస్ భారత్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ఒప్పో రెనో 6 స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే:6.43అంగుళాలు
ఫ్రంట్ కెమెరా:32 మెగా పిక్సెల్
రియర్ కెమెరా:64+8+2 మెగా పిక్సెల్
ర్యామ్: 8జీబీ
స్టోరేజ్:128జీబీ
బ్యాటరీ కెపాసిటీ:
ఓఎస్: 4300mAh
ఒప్పో రెనో 6 ప్రొ + స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 6.55 అంగుళాలు
ఫ్రంట్ కెమెరా:32 మెగా పిక్సెల్
రియర్ కెమెరా: 50+16+13+2
ర్యామ్: 8జీబీ
స్టోరేజ్:128కజీబీ
బ్యాటరీ కెపాసిటీ:4500mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11
ఒప్పో రెనో 6 ప్రొ స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 6.55 అంగుళాలు
ఫ్రంట్ కెమెరా:32 మెగా పిక్సల్
రియర్ కెమెరా: 64+8+2+2 మెగా పిక్సెల్
ర్యామ్:8GB
స్టోరేజ్:128GB
బ్యాటరీ కెపాసిటీ:4500mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11