శనివారం 27 ఫిబ్రవరి 2021
Science-technology - Jan 18, 2021 , 19:40:44

మరో 5జీ ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో..ప్రీ-బుకింగ్స్‌ ప్రారంభం

మరో 5జీ ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో..ప్రీ-బుకింగ్స్‌ ప్రారంభం

ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో    మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.  రెండు రోజుల క్రితం  ‘ఒప్పో ఎ93 5జీ’ పేరుతో చైనాలో ఫోన్‌ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.   తాజాగా ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌  ఒప్పో రెనో 5ప్రో 5జీ మోడల్‌ను సోమవారం భారత్‌లో విడుదల చేసింది.   ఈ కొత్త మోడల్ క్వాడ్ రియర్ కెమెరాలతో పాటు  65W ఫాస్ట్ ఛార్జింగ్‌తో  వస్తుంది. 

రెనో 5 ప్రో హోల్‌ పంచ్‌ డిస్‌ప్లే డిజైన్‌తో వస్తున్నది.   భారత్‌లో  ఒప్పో రెనో 5  ఫ్రొ  సింగిల్‌ వేరియంట్‌  8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్  ధర రూ.35,990గా ఉంది.  ఈ ఫోన్‌   ఆస్ట్రల్ బ్లూ,   స్టార్రి బ్లాక్ కలర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. 

జనవరి 22 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఒప్పో ఇండియా ఇ-స్టోర్‌, రిటైల్‌ షాపుల్లో  ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.  ప్రీ-బుకింగ్స్‌ ఇవాళ్టి నుంచి మొదలయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ,   ఐసీఐసీఐ  బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేసినవారికి  10 శాతం క్యాష్‌బ్యాక్‌ లభించనుంది.  హెచ్‌డీఎఫ్‌సీ వినియోగదారులకు 3,500 వరకు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చు. 

VIDEOS

logo