మంగళవారం 31 మార్చి 2020
Science-technology - Mar 02, 2020 , 16:30:43

రూ.7,990కే ఒప్పో నూతన వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌

రూ.7,990కే ఒప్పో నూతన వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌

మొబైల్స్‌ తయారీదారు ఒప్పో.. ఎన్‌కో ఫ్రీ పేరిట నూతన వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను భారత్‌లో ఇవాళ విడుదల చేసింది. వీటిలో 13.44 ఎంఎం డ్రైవర్స్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఇవి అద్భుతమైన సౌండ్‌ క్వాలిటీని ఇస్తాయి. బ్లూటూత్‌ 5.0 ద్వారా ఇవి ఫోన్లకు కనెక్ట్‌ అవుతాయి. వీటికి ఐపీఎక్స్‌4 స్వెట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. ఇవి 5 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. అదే చార్జింగ్‌ కేస్‌తో అయితే 25 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. యూఎస్‌బీ టైప్‌ సి పోర్టు ద్వారా వీటిని చార్జింగ్‌ చేసుకోవచ్చు. రూ.7,990 ధరకు ఈ ఇయర్‌బడ్స్‌ వినియోగదారులకు అమెజాన్‌లో మార్చి 4వ తేదీ నుంచి లభ్యం కానున్నాయి. 


logo
>>>>>>