కాస్ట్లీ స్మార్ట్‌ఫోన్ కొన్నా కూడా దానికి తగ్గట్టుగా ఇయర్ ఫోన్స్ ఉండాల్సిందే. లేకుంటే.. ఆ ఫోన్ లుక్కే మారిపోతుంది. స్మార్ట్‌ఫోన్‌కు అందమే ఇయర్ ఫోన్స్. అందుకే.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు.. బెస్ట్ ఇయర్‌ఫోన్స్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటారు. ఇదివరకు అంటే.. వైర్‌తో ఉండే ఇయర్‌ఫోన్స్‌ను వాడేవారు. ఇప్పుడంతా వైర్లెస్సే. బ్లూటూత్‌తో కనెక్ట్ చేసుకునే ఇయర్ ఫోన్స్ వచ్చేశాయి.
యాపిల్ ఎయిర్‌పాడ్స్ రేంజ్లో కొన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు.. ఇయర్‌బడ్స్‌ను తీసుకొస్తున్నాయి.
ఒప్పో కంపెనీ కూడా ఎన్కో బడ్స్ పేరుతో.. ఇయర్ బడ్స్‌ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. క్రిస్టల్ క్లియర్ ఆడియో, లాంగ్ ప్లేబ్యాక్ టైమ్ లాంటి ఫీచర్లతో ఈ ఇయర్‌బడ్స్ విడుదల కానున్నాయి. సెప్టెంబర్ 8న ఈ ఇయర్‌బడ్స్‌ను ఒప్పో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తోంది.
కాల్స్ మాట్లాడే సమయంలో.. ఎలాంటి సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా.. నాయిస్ రిడక్షన్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. బ్యాటరీ లైఫ్ మీద కూడా ఒప్పో ఎక్కువ ఫోకస్ పెట్టింది. అందుకే.. సింగిల్ చార్జ్‌తో 6 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ ఉంటుంది. ఒకవేళ చార్జింగ్ కేస్‌తో ఇయర్ బడ్స్‌ను ఉపయోగిస్తే.. 24 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ ఉండనుంది.
గత ఏప్రిల్‌లోనే ఒప్పో ఈ ఇయర్‌బడ్స్‌ను థాయిలాండ్‌లో రిలీజ్ చేసింది. అక్కడ దీని ధర సుమారుగా రూ.2300 ఉంది. ఇండియాలో కూడా అదే రేంజ్ ధరలో ఇయర్‌ఫోన్స్ అందుబాటులో ఉండనున్నాయి.
బ్లూటూత్ వీ5.2, ఒక్క ఇయర్ బడ్లో 40 ఎంఏహెచ్ బ్యాటరీ, చార్జింగ్ కేస్‌లో 400 ఎంఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, వాటర్ రెసిస్టెంట్ లాంటి పీచర్లతో ఈ ఇయర్‌బడ్స్ విడుదల కానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : iPhone 13 Satellite Feature : ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. శాటిలైట్ ఫీచర్ ఇప్పట్లో లేనట్టే
JioPhone Next 4G : అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్.. జియోఫోన్ నెక్స్ట్ లాంచ్ డేట్ వచ్చేసింది
Redmi Earbuds 3 Pro : 30 గంటల బ్యాటరీ లైఫ్‌తో రెడ్మీ ఇయర్‌బడ్స్ 3 ప్రో విడుదల
Realme Pad : రియల్మీ నుంచి తొలి ట్యాబ్.. రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే