క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో)గా కొనసాగుతున్న నిక్ హాక్లీ శాశ్వత సీఈవోగా నియమితులయ్యారు. హాక్లీ నియామకాన్ని సీఏ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది.
జూన్ 2020 నుంచి హాక్లీ తాత్కాలిక సీఈవోగా పనిచేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా సీఏ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో ఇంతకు ముందు సీఈవో కెవిన్ రాబర్ట్స్ కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు.
పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కెవిన్ పదవికిరాజీనామా చేయడంతో తాత్కాలిక సీఈవోగా హాక్లీని ఎంపిక చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ గత సీజన్లో ఆస్ట్రేలియా అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ సిరీస్లను హాక్లీ విజయవంతంగా నిర్వహించారు. తన సేవలను గుర్తించిన ఆస్ట్రేలియా మళ్లీ హాక్లీకే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు.