గురువారం 28 జనవరి 2021
Science-technology - Jan 14, 2021 , 21:18:41

స‌ర్కార్ సందేహాల‌కు జ‌వాబిస్తాం: వాట్సాప్‌

స‌ర్కార్ సందేహాల‌కు జ‌వాబిస్తాం: వాట్సాప్‌

న్యూఢిల్లీ: ఏక‌ప‌క్షంగా ప్ర‌క‌టించిన ‌నూత‌న ప్రైవ‌సీ పాల‌సీతో యూజ‌ర్లంతా త‌మ ప్ర‌త్య‌ర్థి యాప్ సంస్థ‌లు టెలిగ్రామ్‌, సిగ్న‌ల్ వైపు చూస్తుండ‌టంతో ఫేస్‌బుక్ అనుబంధ వాట్సాప్ తాజాగా మ‌రో వివ‌ర‌ణ ఇచ్చింది. త‌మ నూత‌న ప్రైవ‌సీ పాల‌సీపై ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిస్తామ‌ని వాట్సాప్ హెడ్ విల్‌చాత్‌కార్ట్ పేర్కొన్నారు. యూజ‌ర్ల విశ్వాసాన్ని, న‌మ్మ‌కాన్ని చూర‌గొన‌డంలో సిగ్న‌ల్ వంటి ప్ర‌త్య‌ర్థుల‌తో పోటీ ప‌డ‌తామ‌న్నారు. భార‌త్ వ్యాప్తంగా త‌మ యూజ‌ర్ల సెక్యూరిటీ, ప్రైవ‌సీకి క‌ట్టుబ‌డి ఉన‌్నామ‌ని పీటీఐకిచ్చిన ఇంట‌ర్వ్యూలో గురువారం చెప్పారు. యూజ‌ర్ల సందేశాలు.. ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అని పేర్కొన్నారు. 

అప్‌డేటెడ్ ప్రైవ‌సీ పాల‌సీకి యూజ‌ర్ల నుంచి వాట్సాప్ యాజ‌మాన్యం అనుమ‌తి కోరిన త‌ర్వాత ఆ సంస్థ‌కు ప్ర‌త్య‌ర్థి యాప్‌లైన టెలిగ్రామ్‌, సిగ్న‌ల్ యాప్‌ల డౌన్‌లోడ్లు అసాధార‌ణ రీతిలో పెరిగిపోతున్నాయి. త‌మ యూజ‌ర్లు భారీగా సిగ్న‌ల్‌, టెలిగ్రామ్ యాప్‌ల వైపు త‌ర‌లి వెళ్ల‌డం లేద‌ని విల్‌చాత్‌కార్ట్ అన్నారు. ప్రైవ‌సీ ప‌రిర‌క్ష‌ణ కోసం పోటీ త‌త్వం పెరుగ‌డం మంచిదేన‌న్నారు. భ‌విష్య‌త్‌లో ప్రైవ‌సీ మ‌రింత ప్రైవేట్‌గా మారుతుంద‌న్నారు.  

ఇదిలా ఉంటే, కేంద్ర ఐటీ మంత్రిత్వ‌శాఖ.. వాట్సాప్ నూత‌న ప్రైవ‌సీ పాలసీ ప్ర‌భావాన్ని అంచ‌నా వేస్తున్న‌ట్లు స‌మాచారం. దీని ప్ర‌భావంపై ఐటీ మంత్రిత్వ‌శాఖ‌.. వాట్సాప్ ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. గ‌త కొన్నేండ్లుగా ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు స‌మాచారం తీసుకువెళ్తుంద‌ని వాట్సాప్‌పై ప్ర‌భుత్వం నుంచి విమ‌ర్శ‌లు రావ‌డంతో.. ఆ దిశ‌గా ఈ ప్ర‌భుత్వ రంగ అనుబంధ సంస్థ ప‌లు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo