ఆదివారం 09 ఆగస్టు 2020
Science-technology - Jul 03, 2020 , 14:00:10

మూడు స్మార్ట్‌టీవీలను లాంచ్‌ చేసిన వన్‌ప్లస్‌

మూడు స్మార్ట్‌టీవీలను లాంచ్‌ చేసిన వన్‌ప్లస్‌

న్యూఢిల్లీ:  ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో తనదైన ముద్రవేసిన  చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ తాజాగా భారత్‌లో స్మార్ట్‌టీవీలను ఆవిష్కరించింది.  అద్భుతమైన ఫీచర్లతో వన్‌ప్లస్ టీవీ యు(U), వై(Y) సిరీస్‌లో  సరికొత్త టీవీలను మార్కెట్లోకి  విడుదల చేసింది. వై సిరీస్‌లో రెండు మోడళ్లను లాంచ్‌ చేసింది. బడ్జెట్‌  ధరలో విడుదలైన ఫోన్ల ముందుగా భారత్‌లోనే అందుబాటులోకి తెచ్చారు. 

మూడు స్మార్ట్‌టీవీ వేరియంట్లు ఇ-కామర్స్‌ అమెజాన్‌లో ప్రత్యేకంగా అమ్మకానికి ఉంటాయని కంపెనీ  తెలిపింది.  వన్‌ప్లస్‌ 8 సిరీస్‌తో సహా పలు వన్‌ప్లస్‌ ఫోన్లను భారత్‌లోనే తయారు చేస్తున్నట్లు చెప్పింది.  దేశవ్యాప్తంగా యాంటీ  చైనా  సెంటిమెంట్ పెరుగుతున్న నేపథ్యంలో  మేక్ ఇన్ ఇండియా విధానానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. 

3 స్మార్ట్‌టీవీలు ఇవే..

OnePlus TV 55-ఇంచుల U1.. ధర రూ. 49,999

OnePlus TV 43-ఇంచుల Y1..  ధర రూ.22,999

OnePlus TV 32-ఇంచుల Y1.. ధర రూ.12,999


logo