మంగళవారం 14 జూలై 2020
Science-technology - Jun 28, 2020 , 17:17:32

బ‌డ్జెట్ ధ‌ర‌లో వన్‌ప్లస్‌ స్మార్ట్‌టీవీలు

బ‌డ్జెట్ ధ‌ర‌లో వన్‌ప్లస్‌ స్మార్ట్‌టీవీలు

న్యూఢిల్లీ: యాపిల్, శామ్‌సంగ్‌ వంటి దిగ్గజ  కంపెనీలకు గట్టిపోటీనిస్తున్న  వన్‌ప్లస్ ఇప్పుడు స్మార్ట్‌టీవీల విభాగంలోనూ దూసుకెళ్తోంది. చైనాకు చెందిన వన్‌ప్లస్‌ బడ్జెట్‌ ధరలో స్మార్ట్‌టీవీలను జులై 2న భారత్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది.  తాజాగా కంపెనీ సోషల్‌మీడియాలో టీజర్‌ విడుదల చేసింది.  వన్‌ప్లస్‌ టీవీ సిరీస్‌లో భాగంగా ఒకేసారి మూడు టీవీలను ఆవిష్కరిస్తున్నామని ప్రీ-బుకింగ్‌ చేసుకోవచ్చని ట్విటర్లో పేర్కొంది.

ఫస్ట్‌ మోడల్‌ ‌ ధర రూ.20వేలలోపు ఉంటుంది. ఇక తర్వాతి రెండు టీవీ మోడళ్ల ధరలు వరుసగా 30వేలు, 50వేల లోపు ఉండనున్నట్లు ప్రకటించింది.  అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా వినియోగదారులు ప్రీ-బుకింగ్‌ చేసుకోవచ్చు.  షియోమీకి చెందిన ఎంఐ టీవీ, రియల్‌మీ టీవీ ఇటీవల భారత్‌లో స్మార్ట్‌టీవీలను లాంచ్‌ చేశాయి. ఈ రెండు కంపెనీలే లక్ష్యంగా బడ్జెట్‌ ధరలో అద్భుత ఫీచర్లతో నూతన మోడళ్లను వన్‌ప్లస్‌ వచ్చే నెల ఆవిష్కరించనుంది. 


logo