ముంబై, జూన్ 10: ప్రముఖ వన్ప్లస్ సంస్థ చాలా కాలం నుంచి లాంచ్ చేయాలని చూస్తున్న వన్ప్లస్ నార్డ్ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. వన్ప్లస్ సంస్థ తాజా వన్ప్లస్ నార్డ్ ను కూడా కొనుగోలు చేయడానికి ప్రీ-ఆర్డర్ లిస్ట్ లో ఉంచింది. వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ జూలై 15 మధ్యాహ్నం1.30 గంటల నుంచి అమెజాన్లో ప్రారంభం కానున్నాయి.
పరిమిత సంఖ్యలో విడుదలయ్యే ఈ స్మార్ట్ఫోన్ ను ముందస్తు ఆర్డర్ ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు కొన్ని సర్పైజ్ గిఫ్ట్స్ కూడా అందించనున్నారు. ఆగస్టు 31 లోగా వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేసిన వినియోగదారులు కూడా సంస్థ అందిస్తున్న బహుమతులతో రెండవ గిఫ్ట్ బాక్స్ ను పొందవచ్చు.