శనివారం 04 ఏప్రిల్ 2020
Science-technology - Mar 08, 2020 , 13:29:22

వన్‌ప్లస్‌ గుడ్‌ న్యూస్‌.. ఇంటి వద్దే ఫోన్‌ రిపేర్‌ సేవలు..!

వన్‌ప్లస్‌ గుడ్‌ న్యూస్‌.. ఇంటి వద్దే ఫోన్‌ రిపేర్‌ సేవలు..!

ఢిల్లీ: మొబైల్స్‌ తయారీదారు వన్‌ప్లస్‌ భారత్‌లో ఉన్న తన స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇకపై ఆ ఫోన్లు రిపేర్‌కు వస్తే వినియోగదారులు సర్వీస్‌ సెంటర్‌కు ఫోన్లను తీసుకుని వెళ్లాల్సిన పనిలేదు. వారి ఇంటి వద్దే ఆ ఫోన్లను రిపేర్‌ చేసి ఇస్తారు. ఇందుకు గాను వినియోగదారులు వన్‌ప్లస్‌ కేర్‌ యాప్‌లోకి వెళ్లి తాము అందుబాటులో ఉండే తేదీ, సమయం తదితర వివరాలను అందులో నమోదు చేసి అనంతరం ఫోన్‌ రిపేర్‌కు స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. దీంతో నిర్దేశిత సమయంలో వన్‌ప్లస్‌ టెక్నిషియన్స్‌ వినియోగదారుల ఇళ్లకు వచ్చి వారి ఫోన్లను రిపేర్‌ చేసి ఇస్తారు. అయితే ఈ విధానంలో ఫోన్‌ రిపేర్‌ కాకపోతే కస్టమర్లు సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. 

కాగా వన్‌ప్లస్‌ తీసుకువచ్చిన ఈ డోర్‌స్టెప్‌ ఫోన్‌ రిపేర్‌ సర్వీస్‌ ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, పూణె నగరాల్లోనే అందుబాటులో ఉంది. అలాగే ఈ నగరాల్లో కొన్ని ఎంపిక చేసిన పిన్‌కోడ్లలోనే ఈ సేవలు లభిస్తున్నాయి. కనుక కస్టమర్లు స్లాట్‌ బుక్‌ చేసుకునే సమయంలో పిన్‌ కోడ్‌ నంబర్‌ను కరెక్ట్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక త్వరలోనే ఈ సర్వీస్‌ను టైర్‌-1, టైర్‌-2 సిటీల్లోనూ అందుబాటులోకి తేనున్నామని వన్‌ప్లస్‌ వెల్లడించింది. 


logo