బుధవారం 03 జూన్ 2020
Science-technology - Apr 06, 2020 , 13:22:31

ఈ నెల 7, 8 తేదీల్లో గులాబీ వ‌ర్ణంలోకి జాబిలి

ఈ నెల 7, 8 తేదీల్లో గులాబీ వ‌ర్ణంలోకి జాబిలి

 ఈ నెల 7, 8 తేదీల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. తెల్ల‌ని వ‌ర్ణంలో ఉండే జాబిలి గులాబీ వ‌ర్ణంలోకి మార‌నుంది. ఎందుకంటే ఆ రోజు చంద్రుడు సూప‌ర్‌మూన్‌గా మార‌నున్నాడు. వాస్త‌వానికి సూప‌ర్‌మూన్ అంటే చంద్రుడు తన కక్ష్యలో తిరిగే క్రమంలో భూమికి అతి...దగ్గరగా వచ్చినప్పుడు సాధారణం కంటే 7శాతం పెద్దగా, 15 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అందుకే ఆ రోజున క‌నిపించే చంద‌మామ‌ను సూప‌ర్‌మూన్‌గా పిలుస్తారు. దీనిని భూ కక్ష్యలో చంద్రుడు దగ్గరగా ఉండే స్థానాన్ని పెరోజి అంటారు. ఈ పెరోజీలోకి వచ్చినప్పడు చంద్రుడు మరింత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించి అందరినీ అలరిస్తాడు. 


సాధారణంగా...భూమికి, చంద్రుడికి మధ్య దూరం 3,84,000 కి.మీ. ఉంటుంది. కానీ ఏప్రిల్‌ 7, 8వ తేదీల్లో ఆ దూరం 3,56,000 కి.మీ. తగ్గిపోతుందని ఖ‌గోళ‌వేత్తలు చెబుతున్నారు. దీని ఫ‌లితంగా పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడు గ‌తం కంటే 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా సూపర్‌ పింక్ మూన్ ద‌ర్శ‌న‌మిస్తాడు. గ‌డిచిన 20 ఏళ్లలో ఇప్పటివరకు 79 సూపర్‌ మూన్‌లు వచ్చాయి. సగటున మూడు నెలలకో సూపర్‌ మూన్‌ కనిపిస్తుంది. ఈ ఏడాది నెల‌కో సూప‌ర్‌మూన్ వ‌స్తుంది. 


 అయితే ఈ అద్భుతాన్ని చూడాల‌నుకునే భార‌తీయుల‌కు మాత్రం ఈ సూపర్‌ మూన్‌ అందాలను పూర్తిగా ఆస్వాదించే పరిస్థితి లేదు. ఎందుకంటే భారత్‌లో ఉదయం సమయం కాబట్టి సూపర్‌ మూన్‌ పూర్తి స్థాయిలో కనిపించే అవకాశాలు తక్కువ ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. కాగా దీనిని ఉత్తర అమెరికాలాంటి ప్రాంతాల్లో పింక్‍మూన్‍ అని, ఇతర దేశాల్లో స్ప్రౌటింగ్‍ గ్రాస్‍ మూన్‍, ది ఎగ్‍ మూన్‌, ది ఫిష్‌మూన్ అని పిలుస్తుంటారు. భారత్‍లో సూపర్‍మూన్‍ ద‌ర్శ‌న‌మివ్వ‌దు. ఈ సారి చంద్రుడు భూమికి ద‌గ్గ‌ర‌గా వచ్చినప్పుడు భారత్‍లో సమయం 8వ తేదీ ఉదయం 8:05గా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.



logo