శనివారం 24 అక్టోబర్ 2020
Science-technology - Sep 27, 2020 , 19:19:01

ఒకినవ ఎలక్ట్రికల్ స్కూటర్ ఫీచర్స్ ...

ఒకినవ ఎలక్ట్రికల్ స్కూటర్ ఫీచర్స్ ...

 బెంగళూరు : ఒకినవ కంపెనీ స్లో స్పీడ్ స్కూటర్ ను విపణిలోకి ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ ను పిల్లలకు కూడా మంచి అనుభవాన్ని అందించేందుకు వీలుగా రూపొందించారు. అయితే ఈ స్కూటర్ కేవలం గంటకు 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించగలవు. ముఖ్యంగా వీటిని మహిళలు ఇంట్లో ఉండే మధ్య వయసు పిల్లలు కూడా బయటికి వెళ్లడానికి ఎంత గానో సౌకర్యవంతంగా ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒకినవ ఆర్ 30 మోడల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇక ఈ స్కూటర్ లో బ్యాటరీ 1.5 కిలో వాట్స్ లిథియం అయాన్ బ్యాటరీ మార్చుకునే విధంగా ఉంటుంది.

5 ఏఎంపీ ద్వారా మన ఇంట్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక ఈ స్కూటర్ డిజైన్ విషయానికొస్తే పెరల్ వైట్, సన్ రైస్ ఎల్లో, సి గ్రీన్, మెటాలిక్ ఆరెంజ్, గ్లోసి రెడ్ లాంటి మొత్తం ఐదు రంగులలో ఈ స్కూటర్ లభించనున్నది.ఈ స్కూటర్ కు మరింత అందాన్ని చేకూర్చేందుకు స్టైలిష్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్ ధర రూ . 58,992 . కాగా ఇందులో మొత్తం మూడు సంవత్సరాల వారంటీతో మోటార్ సైకిల్ పైబ్యాటరీ ని అందించనున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo