బుధవారం 03 మార్చి 2021
Science-technology - Feb 09, 2021 , 11:01:56

క్రెడిట్ కార్డు నుంచే రెంట్‌.. పేటీఎం సూప‌ర్ ఆఫ‌ర్‌

క్రెడిట్ కార్డు నుంచే రెంట్‌.. పేటీఎం సూప‌ర్ ఆఫ‌ర్‌

హైద‌రాబాద్‌: డిజిట‌ల్ ఫైనాన్షియ‌ల్ సేవ‌లు అందించే పేటీఎం త‌న యూజ‌ర్ల‌కు ఓ సూప‌ర్ ఆఫ‌ర్ ఇస్తోంది. త‌న ప్లాట్‌ఫామ్‌పై ఉన్న రెంట్ పేమెంట్స్ ఫీచ‌ర్‌ను మ‌రింత మెరుగుప‌రిచింది. ఇక నుంచి ఓ యూజ‌ర్‌ త‌న క్రెడిట్ కార్డు ద్వారా నేరుగా య‌జ‌మాని బ్యాంక్ ఖాతాకు అద్దె చెల్లించ‌వ‌చ్చు. అంతేకాదు ఇలాంటి ట్రాన్సాక్ష‌న్ల‌పై రూ.1000 వ‌ర‌కూ క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. ప్ర‌తి ట్రాన్సాక్ష‌న్‌పై క్యాష్‌బ్యాక్ అందుకోవ‌డంతోపాటు క్రెడిట్ కార్డు పాయింట్లు కూడా వ‌స్తాయి. 

రెంట్ ఇలా చెల్లించండి

దీనికోసం సింపుల్‌గా పేటీఎం హోమ్ స్క్రీన్‌పై ఉన్న రీచార్జ్‌&పే బిల్స్ సెక్ష‌న్‌లోని రెంట్ పేమెంట్ సెల‌క్ట్ చేసుకోండి. ఇందులో నుంచి నేరుగా మీ క్రెడిట్ కార్డు ఉప‌యోగించి మీ య‌జ‌మానికి కిరాయి చెల్లించవ‌చ్చు. క్రెడిట్ కార్డు కాకుండా యూపీఐ, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా రెంట్ చెల్లించే అవ‌కాశం పేటీఎం క‌ల్పిస్తోంది. దీనికోసం కేవ‌లం య‌జ‌మాని బ్యాంకు వివ‌రాలు మాత్ర‌మే న‌మోదు చేస్తే స‌రిపోతుంది. ఈ డ్యాష్‌బోర్డు మీరు చెల్లించిన కిరాయిల వివ‌రాల రికార్డును మెయింటేన్ చేయ‌డంతోపాటు బ‌కాయిల‌ను కూడా రిమైండ్ చేస్తుంది. అంతేకాదు వెంట‌నే రెంట్ చెల్లించిన‌ట్లు య‌జ‌మానికి నోటిఫికేష‌న్ కూడా పంపిస్తుంది. ఎప్పుడైనా జేబులో డ‌బ్బులు లేని స‌మ‌యంలో క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ చెల్లించే ఆప్ష‌న్ బాగా ఉప‌యోగ‌ప‌డ‌నుంది. 

VIDEOS

logo