శుక్రవారం 29 మే 2020
Science-technology - Feb 04, 2020 , 18:30:59

ఇకపై గూగుల్‌ సెర్చ్‌తో మొబైల్‌ రీచార్జి చేసుకోవచ్చు..!

ఇకపై గూగుల్‌ సెర్చ్‌తో మొబైల్‌ రీచార్జి చేసుకోవచ్చు..!

ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫాంపై గూగుల్‌ సెర్చ్‌ను వాడుతున్న యూజర్లకు గూగుల్‌ ఓ సరికొత్త ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఇకపై యూజర్లు గూగుల్‌ సెర్చ్‌ ద్వారానే తమ ప్రీపెయిడ్‌ మొబైల్‌ను రీచార్జి చేసుకోవచ్చు. అందుకు గాను గూగుల్‌ సంస్థ దేశంలోని టెలికాం ఆపరేటర్లయిన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌ కంపెనీలతో భాగస్వామ్యం అయింది. ఈ క్రమంలో యూజర్లు గూగుల్‌ సెర్చ్‌లో ప్రీపెయిడ్‌ మొబైల్‌ రీచార్జి అని టైప్‌ చేసి సెర్చ్‌ చేస్తే వచ్చే ఆప్షన్లలో తమ మొబైల్‌ నంబర్‌, ఆపరేటర్‌, ప్లాన్‌ వివరాలను ఎంటర్‌ చేసి అక్కడి నుంచి నేరుగా తమ మొబైల్‌ను రీచార్జి చేసుకోవచ్చు. అందుకు గాను మొబిక్విక్‌, పేటీఎం, ఫ్రీచార్జ్‌, గూగుల్‌ పే తదితర పేమెంట్‌ ఆప్షన్లను గూగుల్‌ అందిస్తున్నది..! 


logo