గురువారం 09 జూలై 2020
Science-technology - May 27, 2020 , 14:53:54

నోకియా కంపెనీలో 42 మందికి కరోనా పాజిటివ్‌.. ప్లాంట్‌ మూసివేత

నోకియా కంపెనీలో 42 మందికి కరోనా పాజిటివ్‌.. ప్లాంట్‌ మూసివేత

చెన్నై: ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్, నెట్‌వర్క్ ఎక్విప్‌మెంట్ తయారీ సంస్థ తమిళనాడులోని ఓ ప్లాంట్‌లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఫ్యాక్టరీలో కొంతమంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో  శ్రీపెరంబుదూర్‌ తయారీ ప్లాంట్‌ను మూసివేసినట్లు  ప్రకటించింది. 42 మందికి కరోనా సోకినట్లు కంపెనీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కంపెనీలో ఇప్పటికే భౌతిక దూరం పాటించేలా, క్యాంటీన్‌లో సామాజిక దూరానికి అనుగుణంగా మార్పులు చేసినట్లు చెప్పింది.

లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత  తక్కువ మంది ఉద్యోగులతో కంపెనీ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది. మరికొన్ని రోజుల్లోనే పరిమిత ఉద్యోగులతో ప్లాంట్‌ను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.  ఢిల్లీ పరిసరాల్లోని  చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ ఒప్పో ప్లాంట్‌లో  తొమ్మిది మందికి కరోనా సోకడంతో ప్లాంట్‌ను మూసివేసిన విషయం తెలిసిందే.


logo