బుధవారం 23 సెప్టెంబర్ 2020
Science-technology - Aug 15, 2020 , 18:02:25

నోకియా నుంచి మరో కొత్త ఫీచర్ ఫోన్‌!

నోకియా నుంచి మరో కొత్త ఫీచర్ ఫోన్‌!

ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌  బ్రాండ్ నోకియా మరో  సరికొత్త  ఫీచర్ ఫోన్‌ను లాంచ్‌ చేయడానికి సిద్ధమవుతోంది.  స్మార్ట్‌ఫోన్లకు బదులుగా  అధునాతన ఫీచర్లతో రూపొందించిన  ఫోన్‌ను త్వరలోనే  మార్కెట్లోకి విడుదల చేయనుంది.  గత జూన్‌లో నోకియా 5310 ఎక్స్‌ప్రెస్‌ మ్యూజిక్‌ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ మాదిరిగానే త్వరలో మరొక ఫీచర్‌ ఫోన్‌ను తీసుకువస్తున్నది. మోడల్‌ నంబర్‌ TA-1316  పేరుతో తయారు చేసిన ఫోన్‌కు  యూఎస్‌ ఎఫ్‌సీసీ  ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఈ హ్యాండ్‌సెట్‌లో 4జీ కనెక్టివిటీతో పాటు  ఎల్‌టీఈ 5,7, 38 బ్యాండ్లను సపోర్ట్‌ చేస్తుంది.

ఈ ఫోన్‌ బ్యాటరీ కెపాసిటీ 1150mAhగా ఉండనుంది.  ఈ ఫోన్‌ డ్యూయల్‌ సిమ్‌ కార్డులను సపోర్ట్‌ చేయనుంది.  ఫీచర్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేస్తారనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.  ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో  కొన్నేళ్లు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన నోకియా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో మాత్రం అంతగా రాణించలేకపోయింది. 


logo