భారత్లో ఫీచర్ ఫోన్లు వాడే యూజర్లను దృష్టిలో ఉంచుకొని హెచ్ఎండీ గ్లోబల్ తాజాగా మరో రెండు కొత్త ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. స్మార్ట్ఫోన్ బ్రాండ్ నోకియా పేరుతో వీటిని ఆవిష్కరించింది. నోకియా 110 4G, నోకియా 105 4Gల పేరుతో సరికొత్త ఫీచర్ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ రెండు మోడళ్లు 4జీ VoLTE టెక్నాలజీని సపోర్ట్ చేస్తాయి. కొత్త ఫోన్లలో వైర్లెస్ ఎఫ్ఎం రేడియో కూడా ఉంది. వీటిలో ఇన్బిల్ట్ ఎల్ఈడీ టార్చ్ కూడా ఉంది. కొత్త సిరీస్లో నోకియా 110 4జీ వెనుక భాగంలో కెమెరా సెన్సార్ను కలిగి ఉంది.
ఇదే ఫీచర్ నోకియా 105 4జీలో లేదు. 110 మోడల్ ఆక్వా, బ్లాక్, ఎల్లో కలర్ ఆప్షన్లలో రిలీజ్ కాగా, 105 వేరియంట్ బ్లాక్, బ్లూ, రెడ్ కలర్లలో లభించనుంది. ఐతే కొత్త ఫోన్ల ధర, ఎప్పటి నుంచి విక్రయాలు ప్రారంభిస్తారనే విషయంపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. నోకియా 110 4జీ ధర రూ.3,600, నోకియా 105 4జీ ధర రూ.3,100గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
డిస్ప్లే: 1.80 అంగుళాలు
రియర్ కెమెరా: ఉంది
ర్యామ్: 128MB
స్టోరేజ్: 48MB
బ్యాటరీ కెపాసిటీ: 1020mAh
ఓఎస్: సిరీస్ 30+
డిస్ప్లే: 1.80 అంగుళాలు
ర్యామ్: 128MB
స్టోరేజ్: 48MB
బ్యాటరీ కెపాసిటీ: 1020mAh
ఓఎస్: సిరీస్ 30+