ఆదివారం 05 జూలై 2020
Science-technology - Apr 03, 2020 , 13:31:58

రికార్డు.. టీవీ చానళ్లకు పెరిగిన వీక్షకులు

రికార్డు.. టీవీ చానళ్లకు పెరిగిన వీక్షకులు

ముంబై: దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.  వర్క్‌ ఫ్రమ్‌ హోం పనిచేసే ఉద్యోగులు మినహా కొంతమంది ఉదయం తీరిగ్గా నిద్రలేచి కుటుంబసభ్యులతో పిచ్చాపాటిలో గడుపుతున్నారు. అలాగే  టీవీల్లో వచ్చే సినిమాలు, షోలు వీక్షించడంతో  కరోనాపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.   చాలా మంది టీవీలు చూస్తూ కాలం గడిపేస్తుండటంతో రికార్డు స్థాయిలో టీవీ వీక్షకుల సంఖ్య పెరిగింది. 

కరోనా దేశంలోకి ప్రవేశించిన తర్వాత టీవీ వీక్షణంతో పాటు స్మార్ట్‌ఫోన్ల వినియోగం కూడా పెరిగింది.   వినియోగదారులు ఇప్పుడు రోజుకు 3.8 గంటలు లేదా వారానికి 26.4 గంటల పాటు తమ స్మార్ట్‌ఫోన్లతో బిజీగా గడుపుతున్నారు. గతంలో రోజుకు 3.4గంటలు లేదా వారానికి 23.6 గంటలు స్మార్ట్‌ఫోన్‌ వినియోగించేవారు. భారత్‌లో కేవలం వారం రోజుల్లోనే టీవీ వీక్షణం రికార్డు స్థాయిలో 37శాతం పెరిగిందని బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌(బార్క్‌) వెల్లడించింది. 

ప్రతిరోజు  622 మిలియన్ల మంది టీవీ చూస్తున్నారు. ఒక రోజులో సగటున 4 గంటల 40 నిమిషాల పాటు టీవీ ముందు గడుపుతున్నారు.  లాక్‌డౌన్‌ ముగిసేవరకు ఇదే స్థాయిలో వీక్షకుల సంఖ్య నమోదవుతుందని బార్క్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సునీల్‌ లుల్లా తెలిపారు. నాన్‌ ప్రైమ్‌ టైంలోనూ వీక్షకుల సంఖ్య భారీగానే ఉంటుందని వివరించారు. 


logo