సోమవారం 06 ఏప్రిల్ 2020
Science-technology - Mar 14, 2020 , 16:01:34

వాట్పాప్‌లో కొత్త ఫీచర్లు తెలుసుకోండి గురూ

వాట్పాప్‌లో కొత్త ఫీచర్లు తెలుసుకోండి గురూ

వాట్సాప్‌ తన వినియోగదారులను ఎప్పటికప్పుడూ ఆకర్షిస్తున్నది. ఈ ఏడాది మొదలైనప్పటి నుంచే అనేక ఫీచర్లును జోడించి ఆశ్చర్యపరించింది. సెక్యూరిటీ, యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లతో హవా సృష్టిస్తున్నది. ఇటీవల వాట్సాప్‌లో మరిన్ని ఫీచర్లు యాడ్‌ అవుతున్నాయి. మరికొన్ని  హల్‌చల్‌ చేయబోతున్నాయి. ఆ ఐదు ఫీచర్లు ఏంటో చూడండి. 

 హైడ్‌ మ్యూటెడ్‌ స్టేటస్‌ :  ఆండ్రాయిడ్‌ బీటా 2.19.183 అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ రానుంది. మామూలుగా కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న వారి స్టేటస్‌లు మనకు కనిపిస్తాయి.  అందులో ఎవరివి అవసరం లేదో వారివి మ్యూట్‌ చేసుకొనే ఫీచర్‌ ఉంది. కానీ హైడ్‌ ఆప్షన్‌ లేదు. ఈ ఫీచర్‌తో హైడ్‌ కూడా సాధ్యం అవుతుంది.  ఈ హైడ్‌ బటన్‌.. Muted Updates సెక్షన్‌ లో చూడొచ్చు.  Hide బటన్‌ పై ప్రెస్‌ చేస్తే చాలు.. ఆల్‌ మ్యూటెడ్‌ స్టేటస్‌ అప్‌డేట్స్‌ హైడ్‌ అవుతాయి.  పక్కనే Show బటన్‌ కూడా ఉంటుంది. హైడ్‌, మ్యూట్‌ చేసిన స్టేటస్‌ అప్‌ డేట్స్‌ తిరిగి కావాలంటే క్లిక్‌ చేయండి. 

ఫింగర్‌ ఫ్రింట్‌ లాక్‌ :  ఆండ్రాయిడ్‌ ఫోన్లలో యాప్‌ ఓపెన్‌ చేయడానికి ఫింగర్‌ ప్రింట్‌ అన్‌లాకింగ్‌ సిస్టమ్‌ ఫీచర్‌ ఎప్పటి నుంచో ఆకట్టుకునేది. ఇటీవలే దీన్న వాట్సాప్‌ అందుబాటులోకి తెచ్చింది. ఇది మరింత సెక్యూరిటీ ఇస్తుంది.  వాట్సాప్‌ యూజర్లు తమ అకౌంట్‌ ఓపెన్‌ చేసిన ప్రతిసారి ఫింగర్‌ ఫ్రింట్‌ ద్వారా యాక్సస్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం Face Unlock ఫీచర్‌ ను కూడా తీసుకురావాలని చూస్తున్నది వాట్సాప్‌.

  షేర్‌ వాట్సాప్‌ స్టేటస్‌ :  ఈ ఫీచర్‌ వాట్సాప్‌ యూజర్ల అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోల నుంచి యూజర్ల స్టేటస్‌ ను షేర్‌ చేసుకోవచ్చు. డేటా షేరింగ్‌ ద్వారా iOS, ఆండ్రాయిడ్‌ డివైజ్‌  యూజర్ల స్టేటస్‌ను ట్రాన్‌ఫర్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ ద్వారా  వాట్సాప్‌ స్టేటస్‌ ను ఇతర సోషల్‌ అకౌంట్లతో లింక్‌ చేయకుండానే షేర్‌ చేసుకోవచ్చు.  సెక్యూరిటీ పరంగా వాట్సాప్‌ నుంచి స్టేటస్‌ పోస్టులను నేరుగా షేర్‌ కావు.   యూజర్‌ షేర్‌ చేయాలని భావిస్తే మాత్రమే స్టేటస్‌ పోస్టును షేరింగ్‌ చేసుకునే వీలుంది. 

ర్యాంకింగ్‌ ఆఫ్‌ కాంటాక్ట్స్‌ :   ఈ ఫీచర్‌ కూడా త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది.  ఫేవరెట్‌ కాంటాక్టు లిస్టును ప్రిపేర్‌ చేసుకోవచ్చు. అంటే.. ర్యాంకింగ్‌ ఆఫ్‌ కాంటాక్టులుగా సెట్‌ చేసుకోవచ్చు.ఆటోమాటిక్‌గా మీ వాట్సాప్‌ కాంటాక్టులు టాప్‌ లిస్టులో కనిపిస్తాయి.  ఈ ఫీచర్‌ ద్వారా ఆటోమాటిక్‌ కాంటాక్ట్‌ లిస్టు జనరేట్‌ అవుతుంది.  ఎవరి కాంటాకట్స్‌ వాట్సాప్‌ లో ఇంటరాక్షన్‌ ఎక్కువగా ఉంటుందో వారి కాంటాక్టు ర్యాంకింగ్‌ టాప్‌ లిస్టులో ఉంటుంది. 

డార్క్‌ మోడ్‌ :  ఈ ఫీచర్‌ గురించి ప్రత్యేకించి యూజర్లకు చెప్పన్కర్లేదు. ఇతర మెసేజింగ్‌ ప్లాట్‌ ఫాంలో అందుబాటులో ఉంది. త్వరలో వాట్సాప్‌ లో కూడా డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.  ప్రస్తుతం ఈ ఫీచర్‌ డెవలప్‌ మెంట్‌ స్టేజ్‌ లో ఉంది. వచ్చే కొన్ని నెలల్లో డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ యూజర్లకు చేరువ కానుంది.


logo