మంగళవారం 11 ఆగస్టు 2020
Science-technology - Jul 08, 2020 , 16:23:29

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్‌

 ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్‌

  • పిన్‌ యువర్‌ కామెంట్‌ ఆప్షన్‌ను ప్రవేశపెట్టిన యాప్‌

ఇన్‌స్టాగ్రామ్‌ కొత్తగా పిన్‌ యువర్‌ కామెంట్‌ ఆప్షన్‌ను యాప్‌లో ప్రవేశపెట్టింది. ఒక పోస్ట్‌లో మూడు వ్యాఖ్యలను పిన్ చేయడానికి అనుమతిస్తుంది. పిన్ చేసిన వ్యాఖ్యలు థ్రెడ్ పైభాగంలో కనిపిస్తాయి. తద్వారా వినియోగదారులు థ్రెడ్‌పై తమ కామెంట్‌లను రిప్లైల రూపంలో తెలియజేయవచ్చు. మేలో సైబర్ బెదిరింపులను ఎదుర్కోవటానికి ఈ ఆప్షన్‌ మొదట ఒక సాధనంగా పరీక్షించారు. అధికారికంగా మంగళవారం రోజు ఈ ఆప్షన్‌ను యాప్‌లో పెట్టారు. సోషల్ మీడియా కూడా ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పోస్ట్‌లకు వచ్చిన వ్యాఖ్యలను యూజర్‌ పెద్దమొత్తంలో తొలగించడానికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. 

ఇప్పుడు ఇన్‌స్టాలో కామెంట్‌ను పిన్‌ చేయడం చాలాసులభం. కామెంట్‌ను ఎడమ వైపుకు స్వైప్ చేయాలి. అందులో డిలీట్‌, రిప్లై, పిన్‌ వంటి ఆప్షన్లు ఉంటాయి. ఎడమ వైపు కొత్తగా పిన్‌ గుర్తు ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేస్తే ఆ కామెంట్‌ను థ్రెడ్‌ పైభాగంలో పిన్‌ చేస్తుంది. 


ఇన్‌స్టా మంగళవారం ట్విట్టర్‌లో కొత్త ఫీచర్‌ గురించి తెలియజేసింది. ఇది సంభాషణను మరింత సులభతరం చేస్తుందని ఇన్‌స్టా పేర్కొంది. మే నుంచి ఇన్‌స్టాలో కొత్త కొత్త ఫీచర్లు వస్తున్నాయి. ఈ యాప్‌ ఇంతకుముందు ఒకేసారి 25 కామెంట్‌లను తొలగించే ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. యాప్‌లో ఇతర ఐడీలను బ్లాక్‌చేసే ఫీచర్‌ కూడా ఉంది. 

ఇదిలా ఉండగా.. ఇన్‌స్టాగ్రామ్ తన కొత్త షార్ట్ ఫారమ్ వీడియో షేరింగ్ ఫీచర్‌ను రీల్స్ ఇన్ ఇండియాలో పరీక్షిస్తున్నట్లు ప్రకటించింది. టిక్‌టాక్ మాదిరిగానే, వినియోగదారులు రీల్స్‌తో అనేక షేడ్స్‌ను ఉపయోగించి 15 సెకన్ల వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. వాటిని ఎడిట్‌ చేసి పోస్టు కూడా చేసుకునే వెసులుబాటు కల్పించనున్నది. ప్రస్తుతం ఇది పరీక్ష దశలో ఉన్నట్లు ఇన్‌స్టా నిర్వాహకులు తెలియజేశారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo