మంగళవారం 26 మే 2020
Science-technology - May 22, 2020 , 15:26:45

మోటో జీ8 పవర్‌ లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల..ఫీచర్లివే!

మోటో జీ8 పవర్‌ లైట్‌  స్మార్ట్‌ఫోన్‌ విడుదల..ఫీచర్లివే!

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ  మోటోరోలా  జీ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. బడ్జెట్‌ ధరలో రూపొందించిన మోటో జీ8 పవర్ లైట్‌  ఎట్టకేలకు భారత్‌లో విడుదలైంది. కొత్తఫోన్‌ అమ్మకాలను మోటోరోలా నెలాఖరులోగా  ప్రారంభించనుంది. జీ8 పవర్‌ లైట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌లోనే ఆవిష్కరించారు. ఈ ఫోన్‌ రెండు కలర్లలో అందుబాటులో ఉంది. మే 29 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ఫస్ట్‌  సేల్ ఆరంభంకానుంది.    యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ ఉంది. 

మోటీ జీ8 పవర్‌ లైట్‌..:

డిస్‌ప్లే: 6.50 అంగుళాలు

ప్రాసెసర్‌: మీడియాటెక్‌ హీలియో p35

ఫ్రంట్‌ కెమెరా: 8 మెగా పిక్సల్‌

రియర్‌ కెమెరా:16+2+2 మెగా పిక్సల్‌

ర్యామ్‌:4జీబీ

స్టోరేజ్‌:64జీబీ

బ్యాటరీ:5000mAh

ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 9


logo