శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Science-technology - Feb 21, 2021 , 16:53:49

మోటోరోలా నుంచి మరో సరికొత్త ఫోన్

మోటోరోలా నుంచి మరో సరికొత్త ఫోన్

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ మోటోరోలా  మోటో ఇ7 సిరీస్‌లో  సరికొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది.  ఇ-సిరీస్‌లో ఇప్పటికే మోటో ఇ7 ప్లస్‌ను విడుదల చేసిన మోటోరోలా మోటో ఇ7 పవర్‌ను రిలీజ్‌ చేసింది.  5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్  హీలియో జి 25 చిప్‌సెట్, 4 జీబీ ర్యామ్‌,  టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.  సరికొత్త మోడల్‌ భారత్‌లో తయారైందని కంపెనీ వెల్లడించింది.

మోటో ఇ 7 పవర్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది.  2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .7,499 కాగా 4 జీబీ ర్యామ్ + 64 జీబీ వేరియంట్ ధర రూ .8,299గా ఉంది. ఈ ఫోన్‌   తాహితీ బ్లూ,  కోరల్ రెడ్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.  ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 26న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌  ద్వారా కొనుగోలు చేయొచ్చు.

VIDEOS

logo