న్యూఢిల్లీ: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వజ్రంగా భావిస్తున్న 1,098 క్యారెట్ల వజ్రం బోట్స్వానాలో బయటపడింది. ఈ వజ్రం 73 మిల్లీమీటర్ల పొడవు, 52 మిల్లీమీటర్ల వెడల్పు, 27 మిల్లీమీటర్ల మందం ఉన్నది. రెండో అతిపెద్ద వజ్రం కూడా బోట్స్వానాలో 2015లో బయటపడటం విశేషం. కాగా ప్రపంచంలోనే అతిపెద్దదిగా భావించే 3,106 క్యారెట్ల వజ్రాన్ని 1905లో దక్షిణాఫ్రికాలో గుర్తించారు.