గురువారం 28 జనవరి 2021
Science-technology - Oct 29, 2020 , 20:02:14

ఇది కరోనాను అడ్డుకోవడమే కాదు.. క్రియారహితం చేస్తుంది కూడా..!

ఇది కరోనాను అడ్డుకోవడమే కాదు.. క్రియారహితం చేస్తుంది కూడా..!

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే టీకా ఇప్పటిదాకా లేదు. దానికోసం శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని అడ్డుకునేందుకు మనదగ్గర ఉన్న అస్త్రాలు.. మాస్క్‌.. భౌతికదూరం మాత్రమే. అయితే, కొవిడ్‌-19కు కారణమయ్యే సార్స్‌ సీవోవీ-2ను అడ్డుకునే మాస్కులు మాత్రమే ఇప్పటిదాకా మనకు తెలుసు. కానీ కరోనాను అడ్డుకోవడంతోపాటు దాన్ని క్రియారహితం చేసే మాస్కును మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు రూపొందించారు. 

ఈ కొత్త మాస్కు వేడిచేసిన రాగి మెష్‌ను కలిగి ఉంటుంది. దీన్ని శుభ్రంచేసుకుని మళ్లీ వాడవచ్చు. మాస్కు ధరించిన వ్యక్తి గాలిని పీలుస్తూ వదిలినప్పుడు గాలి ఈ రాగి మెష్ అంతటా తిరుగుతుందని, గాలిలోని ఏదైనా వైరల్ కణాలుంటే మెష్ అధిక ఉష్ణోగ్రతల ద్వారా నెమ్మదిగా క్రియారహితం అవుతాయని పరిశోధకులు తెలిపారు. ఈ మాస్క్‌ హెల్త్‌కేర్‌ వర్కర్స్‌తోపాటు జనసమ్మర్థప్రాంతాల్లో నిత్యం పర్యటించే వారికి ఎక్కువగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘ఇది పూర్తిగా కొత్త మాస్క్‌ కాన్సెప్ట్‌.. ప్రధానంగా ఇది వైరస్‌ను నిరోధించదు..వాస్తవానికి వైరస్‌ను మాస్క్‌గుండా వెళ్లేందుకు అనుమతిస్తుంది. కానీ లోపలికి వెళ్లాక వైరస్‌ను క్రియారహితం చేస్తుంది.’అని ఎంఐటీ ప్రొఫెసర్ మైఖేల్ స్ట్రానో తెలిపారు. పరిశోధకులు ఈ మాస్కుల ప్రోటోటైప్‌ల నిర్మాణం ప్రారంభించారు. త్వరలో వాటిని పరీక్షిస్తారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo