బుధవారం 12 ఆగస్టు 2020
Science-technology - Jul 16, 2020 , 14:25:29

ఎంఐ టీవీ స్టిక్‌ వచ్చేసింది!

ఎంఐ టీవీ స్టిక్‌ వచ్చేసింది!

బీజింగ్‌: సాధారణ టీవీల్లోనూ ఫుల్‌ హెచ్‌డీ వీడియోలను స్ట్రీమింగ్‌ చేసేలా పనికొచ్చే ఎంఐ టీవీ స్టిక్‌ను షియోమి కంపెనీ ఎట్టకేలకు ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసింది. అమెజాన్‌ ఫైర్‌ స్టిక్‌ మాదిరిగానే దీన్ని టీవీ హెచ్‌డీఎంఐ పోర్ట్‌కు అనుసంధానించి వీడియోలను స్ట్రీమింగ్‌ చేయవచ్చు. అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ హాట్‌స్టార్‌ ప్లస్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి ఓటీటీల్లో సినిమాలతోపాటు వివిధ షోలను కూడా తిలకించవచ్చు. గూగుల్‌ అసిస్టెంట్‌, క్రోమ్‌కాస్ట్‌ ఫీచర్లు ఇన్‌బిల్డ్‌గా ఉంటాయి. అదనంగా బ్లూటూత్ రిమోట్ కంట్రోల్ ఇచ్చారు. ఈ టీవీ స్టిక్‌ బ్లాక్‌ కలర్‌లో మాత్రమే లభిస్తుంది. రిమోట్‌ కూడా అదే రంగులో ఉంటుంది. 

ఇందులో క్వాడ్‌కోర్‌ సీపీయూ, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మీ ఎంఐ టీవీలో ప్యాచ్‌వాల్‌ లేకున్నా ఆండ్రాయిడ్‌ టీవీ సిస్టమ్‌ను రన్‌ చేస్తుంది.  డాల్బీ ఆడియో, డీటీఎస్ సౌండ్ ఫార్మాట్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇందులో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌ ఇన్‌స్టాల్‌ అయి ఉంటాయి. వీటికోసం రిమోట్‌లో ప్రత్యేక బటన్స్‌ ఉంటాయి.

ప్రస్తుతం 1080 పిక్సెల్‌ వేరియంట్‌లో లభించే ఎంఐ టీవీ స్టిక్‌ ధరను ఆ కంపెనీ 39.99 యూరోలుగా నిర్ణయించింది. అంటే మన కరెన్సీలో రూ. 3,400 అన్నమాట. ఇదిలా ఉండగా, ఇది ఎప్పటినుంచి అందుబాటులో ఉంటుందో షియోమి కంపెనీ ప్రకటించలేదు. అలాగే, ఇండియాలో దీన్ని ఎప్పుడు లాంచ్‌ చేస్తారో కూడా వెల్లడించలేదు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo