మంగళవారం 20 అక్టోబర్ 2020
Science-technology - Sep 16, 2020 , 18:43:07

Mi స్మార్ట్‌బ్యాండ్‌‌ 5 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Mi  స్మార్ట్‌బ్యాండ్‌‌ 5 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ షియోమీ  ఎంఐ సిరీస్‌లో   కొత్త ఎంఐ బ్యాండ్ 5ను భారత్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 29న మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్‌ కార్యక్రమంలో Mi  బ్యాండ్‌ 5ని ఆవిష్కరించనుంది.  ఈ బ్యాండ్‌ను ఇప్పటికే  చైనాలో లాంచ్ చేసింది. ట్విటర్‌లో  షేర్ చేసిన టీజర్‌లో  ఎంఐ బ్యాండ్ 5ను విడుదల చేస్తున్న విషయాన్ని  షియోమీ  ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ  అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లోని ప్రత్యేక పేజీ ఫిట్‌నెస్ బ్యాండ్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు   స్పష్టంగా సూచిస్తున్నది.  ఎంఐ బ్యాండ్‌ 5లో డిస్‌ప్లే సైజ్‌ పెద్దగా ఉండనుంది.

కొత్త బ్యాండ్‌ డిస్‌ప్లే సైజు  1.1 అంగుళాలు ఉండగా  ఎంఐ బ్యాండ్‌ 4 డిస్‌ప్లే 0.95 అంగుళాలు మాత్రమే. బ్యాండ్‌ 4 మాదిరిగానే ఇందులో కూడా యానిమేటెడ్‌ వాచ్‌ ఫేస్‌లను సపోర్ట్‌ చేస్తుంది. ఈ బ్యాండ్‌ బ్లాక్‌, బ్లూ, గ్రీన్‌, పింక్‌, పర్పుల్‌, ఆరెంజ్‌, ఎల్లో స్ట్రాప్‌ కలర్లలో లభిస్తుంది.  రెగ్యులర్‌ వేరియంట్‌ ధర రూ.2000గా ఉండనున్నట్లు తెలుస్తున్నది. 125mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తోన్న బ్యాండ్‌ 5ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 14 రోజుల పాటు పనిచేస్తుంది. 

ఎంఐ స్మార్ట్‌బ్యాండ్‌ 5 స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే టైప్‌:అమోఎల్‌ఈడీ

వాటర్‌ రెసిస్టెంట్‌: ఉంది

హార్ట్‌రేట్‌ మానిటర్‌: ఉంది

కంపాటబుల్‌ డివైజెస్‌: ఆండ్రాయిడ్‌

బ్యాటరీ లైఫ్‌(ఎన్నిరోజులు): 14


logo