శుక్రవారం 05 మార్చి 2021
Science-technology - Feb 22, 2021 , 19:48:46

నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌‌, బ్లూటూత్‌ స్పీకర్‌ను లాంచ్‌ చేసి షియోమీ

నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌‌, బ్లూటూత్‌ స్పీకర్‌ను లాంచ్‌ చేసి షియోమీ

ముంబై: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ షియోమీ మరో రెండు కొత్త ప్రొడక్టులను భారత్‌లో ఆవిష్కరించింది. ఎంఐ నెక్‌బ్యాండ్‌ బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్స్‌ ప్రొ, ఎంఐ పోర్టబుల్‌ బ్లూటూత్‌ స్పీకర్‌(16W)ను మార్కెట్లోకి విడుదల చేసింది.  వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌లు యాక్టివ్ నాయిస్‌ క్యాన్సిలేషన్‌(ANC)ను కలిగి ఉన్నాయి. భారత్‌లో పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్  ధర  రూ .2,499 కాగా  ఇది నీలం, నలుపు రంగుల్లో అందుబాటులో ఉంది. నెక్‌బ్యాండ్‌ ప్రొ ధర రూ.1,799గా ఉండగా ఇది బ్లాక్‌, పర్పుల్‌ కలర్లలో విడుదలైంది. కొత్తగా విడుదలైన  ప్రొడక్టులు    ఎంఐ.కామ్‌ ద్వారా   కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.


VIDEOS

logo