శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Science-technology - Feb 21, 2021 , 22:03:59

ఇదీ మ్యాట‌ర్‌.. త్వ‌ర‌లో లిథియం బ్యాట‌రీ లాంచింగ్‌! బైక్ కూడా !!

ఇదీ మ్యాట‌ర్‌.. త్వ‌ర‌లో లిథియం బ్యాట‌రీ లాంచింగ్‌! బైక్ కూడా !!

న్యూఢిల్లీ: ‌దేశీయంగా ఎల‌క్ట్రిక్ మొబిలిటీని ప‌రుగులు పెట్టించే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ కేంద్రంగా ప‌ని చేస్తున్న ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ (ఈవీ) అండ్ ఎన‌ర్జీ స్టోరేజీ టెక్నాల‌జీ స్టార్ట‌ప్ ‘మ్యాట‌ర్’ ఈ దిశ‌గా ఒక్కో అడుగు ముందుకేస్తున్న‌ది. ఏప్రిల్ నాటికి సోలార్ అండ్ రెనెవ‌బుల్ మేనేజ్మెంట్ లిథియం ఐయాన్ బ్యాట‌రీల‌ను ఆవిష్క‌రించేందుకు స‌ర్వం సిద్ధం చేసింది.

దీని కొన‌సాగింపుగా వ‌చ్చే దీపావ‌ళి ప‌ర్వ‌దినం నాటికి సొంతంగా విద్యుత్ మోటార్ బైక్‌ను మార్కెట్‌లో లాంచ్ చేయ‌డానికి సిద్ధం అవుతున్న‌ది.వ‌చ్చే నాలుగేండ్ల‌లో అంటే 2025 నాటికి 100 కోట్ల డాల‌ర్లు (రూ.7,250 కోట్ల) ట‌ర్నోవ‌ర్ సాధించ‌డం ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు మ్యాట‌ర్ ఫౌండ‌ర్ కం సీఈవో మోహ‌న్ లాల్‌భాయి ప్ర‌క‌టించారు. కేవ‌లం 30 ల‌క్ష‌ల డాల‌ర్ల (రూ. 20 కోట్లపై చిలుకు) పెట్టుబ‌డితో కార్యాచ‌ర‌ణ ప్రారంభించిందీ స్టార్ట‌ప్‌‌.

‘సంప్ర‌దాయ భార‌త ఆటోమొబైల్ మార్కెట్‌లో విద్యుత్ వాహ‌నాల ధ‌ర‌లు అత్య‌ధికంగా ఉండ‌టం అయినా కావాలి. ఉత్ప‌త్తులు డిమాండ్‌కు త‌గిన విధంగా రాక‌పోవ‌డం అయినా కావాలి. అందువ‌ల్లే దేశీయంగా విద్యుత్ వాహ‌నాల మార్కెట్ గ‌తంలో పెరుగ‌లేదు’   అని మోహ‌న్‌లాల్‌భాయి తెలిపారు.

భూతాప నివార‌ణ‌కు ప్ర‌పంచ దేశాల మ‌ధ్య కుదిరిన పారిస్ ఒప్పందం అమ‌లు చేయాలంటే.. ఎకో ఫ్రెండ్లీ న్యూ ఎన‌ర్జీస్‌, ఎన‌ర్జీ సొల్యూష‌న్స్‌తో కూడిన విద్యుత్ వాహ‌నాల వైపు వెళ్ల‌డం త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ మ‌న‌కు లేద‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. వాహ‌నాల వినియోగ‌దారులు విద్యుత్ ఆధారిత వెహిక‌ల్స్‌లో ఇంట‌ర్న‌ల్ కంబుష్ట‌న్ ఇంజిన్‌, దాని విలువ‌ను అర్ధం చేసుకోవాల‌ని మోహ‌న్‌లాల్‌భాయి హిత‌వు చెప్పారు.

కొన్ని కంపెనీలు విద్యుత్ వాహ‌నాల్లో వాడే ఇంట‌ర్న‌ల్ కంబుష్ట‌న్ ఇంజిన్ ధ‌ర 100 శాతం ఎక్కువ ధ‌ర పెడుతున్నాయి. కానీ కొన్ని సంస్థ‌లు 20 శాతం చౌక‌ధ‌ర‌కే అందుబాటులోకి తెచ్చినా.. వాటిని డెలివ‌రీ చేయ‌డం లేదు* అని మోహ‌న్ లాల్‌భాయి వ్యాఖ్యానించారు. చైనా కంపెనీల్లో త‌యారైన త‌క్కువ నాణ్య‌త‌తో కూడిన కంబుష్ట‌న్లు దిగుమ‌తి చేసుకుని దేశీయంగా త‌క్కువ ధ‌ర‌కే అమ్ముతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

భార‌త‌దేశంలో కొత్త సంస్థ‌లు సొంత ఉత్ప‌త్తుల‌ను డెవ‌ల‌ప్ చేయ‌డంపై కేంద్రీక‌రించాయి. విద్యుత్ వెహిక‌ల్స్‌ను స‌రైన విలువ‌కే వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తేవ‌డానికి రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టాయి. 2022-23 నాటికి త‌మ స్టార్ట‌ప్ సంస్థ 50 వేల విద్యుత్ వెహిక‌ల్స్ ఉత్ప‌త్తి చేసేందుకు ప్ర‌ణాళిక రూపొందించింద‌న్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo