బుధవారం 30 సెప్టెంబర్ 2020
Science-technology - Aug 08, 2020 , 15:43:43

ఈ రోజు రాత్రి ఆకాశంలో అద్భుతం..!

ఈ రోజు రాత్రి ఆకాశంలో అద్భుతం..!

న్యూ ఢిల్లీ: ఈ రోజు రాత్రి ఆకాశంలో ఓ అద్భుతం చోటుచేసుకోనున్నది. అంగారకుడు (మార్స్‌), చంద్రుడు సమాంతరంగా కనిపించనున్నారు. అనంతరం చంద్రుడు అంగారకుడికి అత్యంత సమీపంగా వెళ్తాడు. దీంతో చంద్రుడు క్షీణించినట్లు కనిపిస్తాడు. 

మార్స్‌ ప్రతి అక్టోబరులో వ్యతిరేక దిశలో పయనిస్తుంది. అందుకే ఇప్పుడు ప్రతి రాత్రి గడిచేకొద్దీ పెద్దదిగా, ప్రకాశవంతంగా మారుతోంది. రెండు ఖగోళ వస్తువులు ఒకదానికొకటి దగ్గరగా వెళుతున్నప్పుడు, ఈ సంఘటనను ‘సంయోగం’ అంటారు. ఈ దృశ్యం శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామువరకు తూర్పు వైపున కనిపిస్తుంది. చంద్రుడు చిన్నగా కనిపిస్తాడు. ఉత్తర అమెరికాలో ఉన్నవారు దీన్ని తెల్లవారుజామున 4 గంటలకు (ఈడీటీ) స్పష్టంగా చూడొచ్చని ఎర్త్‌ స్కై ఆర్గనైజేషన్‌ తెలిపింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo