గురువారం 01 అక్టోబర్ 2020
Science-technology - Aug 15, 2020 , 17:28:46

సరికొత్త ఎస్‌యూవీ 'థార్'‌ను ఆవిష్కరించిన మహీంద్రా

సరికొత్త ఎస్‌యూవీ 'థార్'‌ను ఆవిష్కరించిన మహీంద్రా

న్యూఢిల్లీ:  దేశీ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) సరికొత్త ఎస్‌యూవీ 'థార్'‌ను ఇవాళ ఆవిష్కరించింది. బీఎస్‌-6 ప్రమాణాలతో రూపొందించిన వాహనం 2.0 లీటర్‌ ఎంస్టాలియన్‌ టీజీడీఐ పెట్రోల్‌ ఇంజిన్‌, 2.2 లీటర్‌ ఎంహాక్‌ డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్లలో  అందుబాటులో ఉండనుందని కంపెనీ తెలిపింది.   అద్భుతమైన ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌ ఫీచర్లతో డిజైన్‌ చేసిన నూతన వాహనం అక్టోబర్‌ 2  నుంచి మార్కెట్లోకి ప్రవేశించనుంది. 

సరికొత్త ఎస్‌యూవీ థార్‌ను అక్టోబర్‌ 2, 2020న లాంచ్‌ చేయనుండా.. ధర, ప్రీ-బుకింగ్‌ తదితర వివరాలను అదే రోజు కంపెనీ ప్రకటించనుంది.  భారత్‌లో డిజైన్‌ చేసి, ఇక్కడి ఇంజినీరింగ్‌ నైపుణ్యంతో మహీంద్రా నాసిక్‌ ప్లాంట్‌లో ఎస్‌యూవీని తయారు చేశారు. ఐకానిక్‌ థార్‌ వాహనం ఆరు కలర్లలో అందుబాటులో ఉండనుంది. 

తాజావార్తలు


logo