శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Science-technology - Feb 22, 2021 , 22:02:30

ఒకేసారి మూడు ఫోన్లను లాంచ్‌ చేసిన ఎల్జీ

ఒకేసారి మూడు ఫోన్లను లాంచ్‌ చేసిన ఎల్జీ

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఎల్‌జీ  ఒకేసారి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో ఆవిష్కరించింది. ఎల్‌జీ డబ్ల్యూ 41 సిరీస్‌లో మిడ్‌ రేంజ్‌ ఫోన్లను లాంచ్‌ చేసింది.  ఎల్జీ W41, W41+, W41 ప్రొ ఫోన్లు ఒకే విధంగా ఉంటాయి. కేవలం ర్యామ్‌, స్టోరేజ్‌ కాన్ఫిగరేషన్లలో మాత్రమే తేడాలున్నాయి.  ఎల్‌జీ డబ్ల్యూ 41లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉండగా,   డబ్ల్యూ 41 + లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి.  హై ఎండ్ మోడల్‌ ఎల్జీ డబ్ల్యూ 41 ప్రొలో  6 జీబీ ర్యామ్, 128  జీబీ స్టోరేజ్ ఉంది. LG W41  ధర రూ .13,490, LG W41+  ధర రూ.14,490 కాగా   LG W41 ప్రొ ధర రూ .15,490గా నిర్ణయించారు. కొత్త ఫోన్లు  లేజర్ బ్లూ,  మ్యాజిక్ బ్లూ అనే రెండు రంగులలో  అందుబాటులో ఉన్నాయి.  

VIDEOS

logo