గురువారం 03 డిసెంబర్ 2020
Science-technology - Nov 16, 2020 , 19:58:42

ఉల్కాపాతాన్ని చూడాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం..!

ఉల్కాపాతాన్ని చూడాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం..!

ఆకాశంలో అద్భుతాలను వీక్షించాలని కలలుగనే వారికి శుభవార్త! ఈ నెల 17, 18 తేదీల్లో ఆకాశంలో సంభవించే ఉల్కాపాతాన్ని కనులారా చూసి ఆనందించడమే కాకుండా.. వాటిని కెమెరాల్లో బంధించేందుకు ఉల్కలు మన ముందుకు రానున్నాయి. నవంబర్‌ నెలలో లియోనిడ్ ఉల్కాపాతం తన వార్షిక రూపాన్ని కనబరిచే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భారత్‌లో నవంబర్ 17,18 తేదీలలో ఉల్కాపాతం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని నార్వేకు చెందిన వెబ్‌సైట్ టైమ్‌డేట్ డేట్.కాం తెలిపింది. ఈ ఏడాదిలో ఉల్కాపాతం నవంబర్ 6 నుంచి ప్రారంభమై నవంబర్ 30 వరకు చురుకుగా కొనసాగనున్నది. 

లియోనిడ్స్ ఉల్కలు కామెట్ టెంపెల్-టటిల్ నుంచి ఉద్భవించాయి. ఇవి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి 33 సంవత్సరాలు సమయం పడుతుంది. ఈ ఉల్కలు ప్రకాశవంతంగా ఉంటాయి. సెకనుకు 71 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ సంవత్సరం ప్రతి గంటకు 10 నుంచి 15 ఉల్కల కనిపిస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. లియోనిడ్ జల్లుల్లో ఫైర్ బాల్స్ కూడా ఉంటాయంట. ఇవి సగటు ఉల్కల కన్నా ఎక్కువసేపు ఉండగల ప్రకాశవంతమైన పెద్ద ఉల్కలు, రంగురంగుల పొడవాటి తోకలతో హోరిజోన్‌కు దగ్గరగా కనిపించే ఉల్కలు "ఎర్త్గేజర్స్". ఉల్కాపాతానికి నక్షత్రరాశికి పేరు పెట్టారని చాలామందికి తెలియదు. లియోనిడ్లు సింహం మ్యాన్‌గా ఏర్పడే నక్షత్రాల కూటమి నుంచి ఉద్భవించిన విధంగా వాటికి పేరు పెట్టారు. 

లియోనిడ్లను పట్టుకోవటానికి, చూసి ఆనందించేందుకు అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు. నగరాల్లో ఉండే వీధి దీపాలు, ఇతర దీపాల కారణంగా ఏర్పడే కాలుష్యంలో ఉల్కలు స్పష్టంగా చూడలేం. అందుకని అర్థరాత్రుల్లో ఊరి చివర ప్రశాంతమైన ప్రదేశానికి బయల్దేరి ఉల్కాపాతం గురించి ఎదురుచూడాల్సి ఉంటుంది. సాధారణంగా మేఘాలు లేని రాత్రిలో ఉల్కలు ఉత్తమంగా కనిపిస్తాయి. చంద్రుడు చాలా ప్రకాశవంతంగా లేని సమయంలో మొత్తం ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు ఉల్కలను స్పష్టంగా చూడొచ్చు. ఉత్తరార్ధగోళంలో లియోనిడ్లు ఎక్కువగా కనిపిస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. దక్షిణార్ధగోళం నుంచి కూడా ఉల్కలను వీక్షించే అవకాశాలు ఉన్నాయి. భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉన్నందున ఉల్కాపాతం జరిగే నవంబర్‌ 17, 18 తేదీల్లో పలు దేశాల శాస్త్రవేత్తలు భారత్‌కు వచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది. లియోనిడ్ ఉల్కాపాతాన్ని ఫొటో తీయాలని కోరుకుంటే.. షట్టర్ రిలీజ్ కేబుల్ లేదా వైడ్ యాంగిల్ లెన్స్‌తో అమర్చిన అంతర్నిర్మిత టైమర్‌తో ట్రపాడ్‌పై మాన్యువల్ ఫోకస్‌తో కెమెరాను ఉపయోగించాలని నాసా సూచిస్తున్నది.

గత ఏప్రిల్‌ 16 నుంచి 25 వరకు జరిగిన ఉల్కాపాతంలో ప్రతి గంటకు 10 నుంచి 15 ఉల్కలు ఆకాశం నుంచి రాలిపడ్డట్లు పరిశోధకులు గుర్తిచారు. వాతావరణం దృశ్యమానతను కూడా ప్రభావితం చేస్తుంది. వాతావరణ శాస్త్రవేత్త డేవ్ హెన్నెన్ ప్రకారం.. పశ్చిమ తీరం వెంబడి కొన్ని తుఫానులు మినహా.. అమెరికాలో ఎక్కువగా రాత్రుల్లో స్పష్టమైన, నిర్మలమైన ఆకాశాలు ఉంటాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.