శనివారం 04 ఏప్రిల్ 2020
Science-technology - Feb 26, 2020 , 18:55:56

నూతన ఇయర్‌బడ్స్‌, ఇయర్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేసిన లెనోవో

నూతన ఇయర్‌బడ్స్‌, ఇయర్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేసిన లెనోవో

లెనోవో కంపెనీ హెచ్‌టీ10 ప్రొ, హెచ్‌టీ20 పేరిట నూతన ఇయర్‌బడ్స్‌ను హెచ్‌ఈ18 ఇయర్‌ఫోన్స్‌ను, హెచ్‌డీ116 పేరిట నూతన హెడ్‌సెట్‌ను భారత్‌లో ఇవాళ విడుదల చేసింది. హెచ్‌టీ10ప్రొ ఇయర్‌బడ్స్‌ 48 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. ఇవి బ్లూటూత్‌ 5.0 ద్వారా కనెక్ట్‌ అవుతాయి. రూ.4599 ధరకు ఈ ఇయర్‌బడ్స్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అలాగే లెనోవో హెచ్‌టీ20 ఇయర్‌బడ్స్‌ రూ.3399 ధరకు లభిస్తున్నాయి. ఇవి 25 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. వీటికి ఐపీఎక్స్‌5 వాటర్‌ రెసిస్టెన్స్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. లెనోవో హెచ్‌ఈ18 ఇయర్‌ఫోన్స్‌ ధర రూ.1199 ఉండగా, ఇవి 12 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. ఇక లెనోవో హెచ్‌డీ 116 హెడ్‌సెట్‌ 24 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఇది బ్లూటూత్‌ 5.0 ద్వారా కనెక్ట్‌ అవుతుంది. దీన్ని రూ.2499 ధరకు కొనుగోలు చేయవచ్చు. logo