గురువారం 13 ఆగస్టు 2020
Science-technology - Jul 11, 2020 , 20:51:49

జియోఫైబర్ వినియోగదారులకు ఉచితంగా మరో స్ట్రీమింగ్ సర్వీస్

జియోఫైబర్ వినియోగదారులకు ఉచితంగా మరో స్ట్రీమింగ్ సర్వీస్

ముంబై: వినియోగదారులకు జియో సంస్థ మరో శుభవార్తను అందించింది. ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ లయన్స్ గేట్ ప్లే.. జియోతో ఒప్పందం కుదుర్చుకుంది. జియో ఫైబర్ వినియోగదారులకు ఈ సేవలు ఉచితంగా లభించనున్నాయి. దీంతో లయన్స్ గేట్ ప్లే సర్వీస్‌లో ఉండే సూపర్‌హిట్‌ హాలీవుడ్‌ సినిమాలను వినియోగదారులు జియో టీవీ ప్లస్ యాప్ ద్వారా ఉచితంగా చూడవచ్చు.

ఈ యాప్‌ను జియో సెట్‌టాప్‌ ద్వారా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు లయన్స్ గేట్ ప్లే ప్రీమియం యాక్సెస్ కూడా ఉచితంగా లభిస్తుంది. అన్ని రకాల కంటెంట్ ఇందులో అందుబాటులో ఉంది.జియో ఫైబర్ సిల్వర్ లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్లలో ఉన్నవారికి ఈ ఆఫర్ అప్లికెబుల్‌ అవుతుంది. జియో ద్వారా భారతీయ వినియోగదారులకు మరింత చేరువ అవుతామని లయన్స్ గేట్ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ జైన్ తెలిపారు.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo